Mokshagna:సరికొత్త పౌరాణిక చిత్రంతో మోక్షజ్ఞ..పాత్ర చాలా పవర్ఫుల్.!

బాలకృష్ణ కొడుకు  మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ కోసం చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. గత రెండు సంవత్సరాల కాలం నుంచి ఆయన వస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి తప్ప వచ్చింది లేదు మనం చూసింది లేదు. కానీ ఈ


Published Jul 29, 2024 12:13:12 AM
postImages/2024-07-29/1722229980_moksha.jpg

న్యూస్ లైన్ డెస్క్: బాలకృష్ణ కొడుకు  మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ కోసం చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. గత రెండు సంవత్సరాల కాలం నుంచి ఆయన వస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి తప్ప వచ్చింది లేదు మనం చూసింది లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన యాక్టింగ్ స్కూల్లో అన్ని మెలకువలు నేర్చుకున్నారట. అయితే ఈ ఏడాది తప్పకుండా మోక్షజ్ఞ మూవీ స్టార్ట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దానికోసం బాలకృష్ణ టాలెంటెడ్ డైరెక్టర్లను ఎంపిక చేస్తారట.

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈయన డైరెక్షన్లోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు మోక్షజ్ఞ కోసం ఒక పవర్ఫుల్ పాత్ర రెడీ చేసినట్టు సమాచారం. ఇప్పటికే ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లాగా ఉండే ఒక ప్రాజెక్టు చేయబోతున్నట్టు చెప్పాడు.

ఇందులో ఇండియన్ మైథాలజీ ఉన్న పాత్రలను బేస్ చేసుకుని ఓ సూపర్ హీరో స్టోరీతో మోక్షాజ్ఞ మూవీ ఉంటుందని  టాక్ వినిపిస్తున్నది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. మహాభారతంలో ఒక పాత్రను బేస్ చేసుకుని ప్రశాంత్ వర్మ  మోక్షజ్ఞ సినిమా కథను రెడీ చేస్తున్నారట.  ఇందులో మోక్షజ్ఞ అభిమన్యుడి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. నిజంగానే మోక్షజ్ఞ  ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సినిమా చేస్తే మాత్రం అద్భుత హిట్టు పడుతుందని చాలామంది అభిమానులు భావిస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి అనౌన్స్   చేయలేదు కానీ అనౌన్స్ కోసమే నందమూరి అభిమానులంతా కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line balakrishna mokshagna mahabharatham prashanth-varma abimanyudu

Related Articles