Mokshagna:మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ..ఆ హీరోయిన్ వద్దంటున్న ఫ్యాన్స్..కారణమీదే.?

Published 2024-07-05 00:22:33

postImages/2024-07-05//1720156802_Untitleddesign4.png

న్యూస్ లైన్ డెస్క్:నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మూడో తరం హీరోలుగా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆయన తర్వాత మోక్షజ్ఞ కూడా  తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు.  అయితే ఆయన హీరోగా వస్తున్నారని గత రెండు సంవత్సరాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ హీరోకు ఉండే కటౌట్ లేకపోవడం, బొద్దుగా ఉండడం వల్ల  ఇన్ని రోజులు  సినిమా చేయలేదట.

ఈ మధ్య కాలంలోనే యాక్టింగ్ స్కిల్స్ మరియు తన బాడీ షేప్ మార్చుకున్నారట. ప్రస్తుతం హీరోకి ఉండే క్వాలిటీస్ అన్ని మోక్షజ్ఞకు వచ్చేశాయి. నెక్స్ట్ సినిమా చేయబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో బాలయ్య ఏ డైరెక్టర్ తో తన కొడుకు సినిమా ఎంట్రీ ఇప్పిస్తారో చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

ఇక డైరెక్టర్ గురించి అయితే బయటకు వచ్చింది కానీ, మరియు మోక్షజ్ఞ సరసాన నటించే హీరోయిన్ ఎవరనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇదే తరుణంలో  చురకత్తిలాంటి హీరోయిన్ ను మోక్షజ్ఞ సరసాన నటించబోతుందట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరయ్యా అంటే  శ్రీలీలా. బాలకృష్ణతో   భగవంతు కేసరి మూవీ లో నటించినప్పుడే, తన టాలెంట్ ను గుర్తించినటువంటి బాలయ్య  తన కొడుకు మోక్షజ్ఞకు ఈ హీరోయిన్ అయితే బాగా సూట్ అవుతుందని అప్పుడే భావించారట. అంతేకాదు ఆ సినిమా షూటింగ్ సమయంలోనే  మోక్షజ్ఞతో నటించడానికి ఒప్పుకుంటావా అని అడిగారట. దీంతో శ్రీ లీలా కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే విషయం అఫీషియల్ గా  బయటకు రాలేదు, కానీ ఇండస్ట్రీలో గుసగుసలు పెడుతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreeleela (@sreeleela14)

బాలకృష్ణకు  శ్రీలీలా నచ్చింది కానీ, నందమూరి ఫ్యాన్స్ మాత్రం కాస్త ఆలోచనలు పడ్డారు. శ్రీనిలా పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ తో నటించింది. ఆ సినిమా పూర్తిస్థాయి హిట్ అవ్వకపోయినా  ఆశించిన ఫలితం మాత్రం వచ్చింది. ఈ చిత్రం తర్వాత శ్రీలీలా లైఫ్ మారింది కానీ , రోషన్ పూర్తిస్థాయిలో వెనుకబడిపోయారు. ఆ విధంగానే మోక్షాజ్ఞతో సినిమా చేస్తే శ్రీలీలాకు పేరు వస్తుంది కానీ, మోక్షజ్ఞ కూడా రోషన్ లా అయిపోతాడా అంటూ  భయపడిపోతున్నారు నందమూరి అభిమానులు. ఈ విధంగా ఆలోచిస్తూ శ్రీలీలా  కాకుండా వేరే హీరోయిన్ అయితే బాగుంటుంది అని కామెంట్స్ పెడుతున్నారు.