ఇండియాలో చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారు. శాస్త్రం ప్రకారమే అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈ శాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశులు వాటి స్థానాలు మారుతున్న కొలది ఆయా రాశుల వారి జీవితాల్లో మార్పులు వస్తుంటాయట. ఆ విధంగా ఈ నెల 24 నుంచి బుధ
న్యూస్ లైన్ డెస్క్: ఇండియాలో చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారు. శాస్త్రం ప్రకారమే అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈ శాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశులు వాటి స్థానాలు మారుతున్న కొలది ఆయా రాశుల వారి జీవితాల్లో మార్పులు వస్తుంటాయట. ఆ విధంగా ఈ నెల 24 నుంచి బుధ తన ఉచ్చ క్షేత్రమైనటువంటి కన్య రాశిలో సంచరించడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుందని పండితులంటున్నారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక, వ్యాపార పరంగా అనేక సమస్యలు తీరిపోయి సంపాదన వైపు పరిగెడతారట. మరి ఆ రాశులవారు ఎవరో ఇప్పుడు చూద్దాం..
వృషభరాశి:
ఈ రాశి వారిలో బుధ, రవులు కలిసిపోవడం వల్ల అనేక శుభ ఫలితాలను పొందుతారట. అంతేకాకుండా వీరికి విపరీతమైనటువంటి రాజయోగం కూడా పడుతుందని అంటున్నారు. ఎలాంటి జటిలమైన సమస్యలైన తొలగిపోతాయట. ఉద్యోగం చేసే వారైతే వారి టాలెంట్ కు తగ్గ ప్రమోషన్స్ ఉంటాయట. ఈ రాశి వారు ఎవరైనా సరే ఏది ప్రయత్నం చేసినా అద్భుతమైన ఫలితం సాధిస్తారట.
మిథునం:
ఈ రాశి వారికి చతుర్థి స్థానంలో రఘు, బుధ కలవడం వల్ల ఉద్యోగం వృత్తి వ్యాపారాల్లో అందలమెక్కుతారట. ముఖ్యంగా బిజినెస్ చేసేవారు వారి ఆలోచనకు మించి లాభాలు పొందుతారట. ఆర్థిక సామాజిక స్థితిగతులన్నీ మెరుగుపడే గృహ, వాహన ప్రయత్నాలు చేపట్టి విజయం సాధిస్తారట. అనారోగ్య సమస్యలన్నీ సెట్ అయిపోయి హ్యాపీగా జీవిస్తారట.
సింహరాశి:
ఈ రాశి వారికి ధన స్థానంలో రాశి అధిపతి రవి దన, లాభాధిపతి బుధుడితో యుతి చెందడం వలన అంచనాలకు మించిన ఆర్థిక పురోగతి సాధిస్తారట. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంటుందని, ఎలాంటి పనులు మొదలుపెట్టిన విజయం సాధిస్తారట. ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో లాభారపరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారని అంటున్నారు.
కన్య రాశి:
ఈ రాశి వారిలో బుదుడితో రవి అనేది కలవడం వల్ల వీరు బుధాదిత్య యోగంతో పాటు విపరీత రాజయోగం కూడా కలుగుతుందట. వీరికి రాజ పూజ్యాలు ఎక్కువగా ఉంటాయని ప్రభుత్వ మూలదనం పొందుతారని అంటున్నారు.