Devara-2: ఈ 5 ట్విస్ట్ ల కోసం దేవర పార్ట్-2 చూడాల్సిందే.?

సెప్టెంబర్ 27 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ల దేవర మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది ఈ సినిమా చూసి బాలేదంటే మరికొంతమంది బాగుంది సినిమాను అందరూ కలిసి చూడొచ్చు అని 


Published Sep 27, 2024 02:12:07 PM
postImages/2024-09-27/1727426527_devara2.jpg

న్యూస్ లైన్ డెస్క్: సెప్టెంబర్ 27 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ల దేవర మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది ఈ సినిమా చూసి బాలేదంటే మరికొంతమంది బాగుంది సినిమాను అందరూ కలిసి చూడొచ్చు అని అంటున్నారు. అయితే సినిమా ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాకి సీక్వెల్ ఉంది

కాబట్టి సీక్వెల్ లో సినిమా మరింత అద్భుతంగా ఉంటుందని కొంతమంది భావిస్తున్నారు. అయితే దేవర పార్ట్ 1 చూసిన చాలా మంది జనాలు ఈ ఐదు విషయాల్లో చూడడం కోసం అయినా సరే దేవర సీక్వెల్ చూడాలి అని అంటున్నారు. అయితే దేవర పార్ట్ -2 చూడడానికి ఐదు ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇందులో మొదటిది దేవర పార్ట్ వన్ లో కొన్ని పాత్రలు అలాగే పూర్తికాకుండానే వదిలేశారు. మరి వీటికి సంబంధించి సీక్వెల్ లో ఏదైనా కొనసాగింపు ఉంటుందా అనేది చూడాలి. అంతేకాకుండా దేవర పార్ట్ వన్ చివర్లో డైరెక్టర్ రెండు రకాల ట్విస్టులు ఇచ్చారు. మరి వర పాత్ర సీక్వెల్ లో ఉంటుందా లేదా అనేది సీక్వెల్ చూస్తేనే తెలుస్తుంది. అలాగే జాన్వీ కపూర్ పాత్ర పార్ట్ వన్ లో తక్కువగా ఉంది కాబట్టి పార్ట్ టు లో ఏదైనా హైప్ ఉంటుందా అనేది చూడాలి.

ఇక వర కి ఆరాధించే భక్తుడిగా రాయప్ప నటించారు. మరి సీక్వెల్ లో రాయప్ప చేసిన నమ్మకద్రోహం ఏంటో వర కి తెలుస్తుందా అనేది తెలియాల్సి ఉంది.అలాగే దేవర పార్ట్ వన్ లో ఎక్కువగా యతి అనే గ్యాంగ్ స్టర్ పాత్ర కనిపించింది. మరి ఈ పాత్రతో దేవర పార్టు టు కి ఏమైనా లింకు ఉంటుందా అనేది చూడాలి. ఇక ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే కచ్చితంగా సీక్వెల్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

newsline-whatsapp-channel
Tags : news-line jr-ntr devara janhvi-kapoor koratala-shiva

Related Articles