తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ ఇతర దేశాలన్నింటిని చూపిస్తూ ఎంతో ఫేమస్ అయినటువంటి యూట్యూబర్ అన్వేష్ అంటే తెలియని వారు ఉండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈయన ఇప్పటికే నా అన్వేషణ ఛానల్
న్యూస్ లైన్ డెస్క్: తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ ఇతర దేశాలన్నింటిని చూపిస్తూ ఎంతో ఫేమస్ అయినటువంటి యూట్యూబర్ అన్వేష్ అంటే తెలియని వారు ఉండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈయన ఇప్పటికే నా అన్వేషణ ఛానల్ ద్వారా ప్రపంచంలోని చాలా ప్రదేశాలను మన కళ్ళ ముందు ఉంచాడు. వివిధ దేశాలలోని సాంప్రదాయాలు ఆహారపు అలవాట్లు అక్కడి అందమైన ప్రదేశాలను మనకు చూపించి ఎంతో ఫేమస్ అయ్యాడు. ఈ విధంగా నా అన్వేషణ అన్వేష్ ఈ వీడియోలు చేస్తూ యూట్యూబ్ ద్వారా మంచి లాభాలు పొందుతున్నాడు.
ఆయనకు ఎంత లాభం వచ్చింది ఎంత సంపాదించాను అనే విషయాలను ఎప్పుడూ యూట్యూబ్ ద్వారా బయట పెడుతూ ఉంటారు. అలాంటి ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కు తాజాగా 40 లక్షల నష్టం వచ్చిందట. దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం..అయితే అన్వేష్ తాజాగా యూరప్ కి వెళ్ళాడు. ఈ ట్రిప్పు ద్వారా ఆయనకు 40 లక్షల నష్టం వచ్చిందట. దీనికి ప్రధాన కారణం ఇక్కడ ప్రతి వస్తువు భారీ రేటు ఉండడమే. రెండు లీటర్ల నీరు కొనాలి అంటే 2000 అవుతుంది. అలాగే ఒక కాఫీ కోసం 500 వెచ్చించాలి. ఇక రూమ్ రెంట్ గురించి చెప్పనక్కర్లేదు.
90 రోజులపాటు ఇక్కడే ఉండి అనేక ప్రదేశాలను చూసిన ఈయన కేవలం 15 వీడియోలు మాత్రమే తన చానల్లో అప్లోడ్ చేశాడు. ఇందులో కొన్ని వీడియోలు బాగా క్లిక్ అయినా మరికొన్ని వీడియోలు అంతంత మాత్రమే ప్రజల్లోకి వెళ్లాయి. దీనికి ప్రధాన కారణం ఈ ప్రదేశాలను చాలా సినిమాల్లో జనాలకు చూపించడం. జనాలు ఈ ప్రదేశాలు ఇప్పటికే చూసి ఉన్నారు కాబట్టి ఆయన పెట్టిన వీడియోలకు అంతగా ఆదరణ దక్కలేదట.
దీంతో ఈ ట్రిప్పులో ఖర్చులు ఎక్కువైపోయి లాభాలు తక్కువ అయిపోవడంతో దాదాపుగా 40 లక్షల నష్టం వచ్చిందని అన్వేష్ వెల్లడించారు. అయితే ఇందులో నుంచి 10 లక్షలు ప్రభుత్వం వెనక్కి ఇస్తుందట. ఇదే తరుణంలో ఆయన ఒక విషయాన్ని చెప్పారు. చాలామంది టూర్లు వెళ్లాలనుకుంటారు. కానీ అప్పులు చేసి ఇలాంటి టూర్స్ కు అసలు వెళ్ళద్దని, దీనివల్ల లైఫ్ లో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం అన్వేష్ ఈ ఈ విధంగా వీడియో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.