బిగ్ బాస్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నటువంటి రియాలిటీ షో.. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తిచేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా అద్భుతంగా కొనసాగుతోంది. అలాంటి బిగ్ బాస్ లో ప్రతి అంశం ఆడియన్స్ నిర్ణయం ప్రకారం
న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నటువంటి రియాలిటీ షో.. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తిచేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా అద్భుతంగా కొనసాగుతోంది. అలాంటి బిగ్ బాస్ లో ప్రతి అంశం ఆడియన్స్ నిర్ణయం ప్రకారం జరుగుతుందని చాలామంది భావిస్తారు. కానీ బిగ్ బాస్ లో ఎక్కువ వరకు ఆడియన్స్ పోలింగ్ ను బట్టి కాకుండా వారి సొంత నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అది ఎలాగంటే కొంతమంది కంటెస్టెంట్లకు తక్కువ ఓటింగ్ ఉన్న కానీ సేవ్ చేస్తూ ఉంటారు.
దీనికి ప్రధాన కారణం బిగ్ బాస్ కు సంబంధించిన వ్యక్తులతో వారికి మంచి సంబంధాలు ఉండడమే అని అంటున్నారు. ఇలా అనడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ప్రస్తుతం హౌస్ లో సోనియా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ తనకు నచ్చిన పదాలను వాడుతూ మిగతా కంటెస్టెంట్లను తిడుతోంది. అయినా బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున అలాగే ఉంచుతున్నాడు. కేవలం చిన్న చిన్న వార్నింగులు ఇస్తూ కాపాడుతూ వస్తున్నాడు. అయితే ఈ వ్యవహారంపై మాత్రం బిగ్ బాస్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.
రెండో వారం నాగార్జున హౌస్ లోకి వచ్చినప్పుడు సోనియాకి రెడ్ కార్డు ఇస్తారని అంతా భావించారు. ఎందుకంటే ఆమె విష్ణు ప్రియపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. కానీ నాగ్ అలా చేయలేదు. అంతేకాకుండా సోనియా ఓ వైపు నిఖిల్ మరో వైపు పృథ్విలతో రకరకాల విషయాలు మాట్లాడుతూ కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇస్తోంది. అయినా నాగార్జున ఆమెని ఏమీ అనకుండా స్వీట్ వార్నింగ్ ఇస్తూ కాపాడుతున్నాడు. ఈ విధంగా నాగార్జున ఆమెను సేవ్ చేస్తూ వస్తుండడంతో చాలామంది ఆడియన్స్ కి డౌట్ పుట్టింది.
అసలు సోనియాను ఎందుకు ఇలా చేస్తున్నాడు, అంతకుముందు సీజన్ లో కూడా శోభా శెట్టిని కాపాడుతూ వచ్చి టాప్ సిక్స్ లో ఉంచాడు. ఈ సీజన్ లో సోనియాను సేవ్ చేస్తూ వస్తున్నాడు. ఈ విధంగానే కొనసాగితే మాత్రం చివరికి సోనియా టాప్2 కి వెళ్లే అవకాశం కూడా ఉన్నదని కొంతమంది ఆడియన్స్ అంటున్నారు. నాగార్జున కావాలనే ఆమెను అలా చేస్తున్నారని, నాగార్జునకు సోనియాకు ఏదో రిలేషన్ ఉందని నెటిజెన్స్ అనుమానిస్తున్నారు.