రూ.50 వేల రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. రిమాండ్ ముగిసిన తర్వాత కోర్టు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు భారీ ఊరట లభించింది అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో షరతులతో కూడిన రెగ్యులర్ బెయిర్ మంజూరు చేసింది. రూ.50 వేల రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. రిమాండ్ ముగిసిన తర్వాత కోర్టు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు.
అదే రోజున రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. అయితే ఆ రెగ్యులర్ బెయిల్ బన్నీకి ఈ రోజు దొరికింది. దీంతో ఆయన కుటుంబసభ్యులు , అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, బెయిల్ మంజూరు సందర్భంగా కోర్టు అల్లు అర్జున్ కు పలు షరతులు విధించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వెల్లడించారు.