Kalki 2898AD: కల్కి 2898 ఏడీ చిత్రంపై ...నారాలోకేష్ ట్వీట్ 2024-06-27 17:23:02

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హాలివుడ్ ( HOLLYWOOD)  రేంజ్ రివ్యూస్ వస్తున్నాయి. టాలీవుడ్ దర్శకులు ( TELUGU DIRECTOR) టాలెంటెడ్ అని నిరూపించుకుంటున్నారు. ఈ సారి హాలివుడ్ లో కూడా మన పేరు చాలా గట్టిగా వినిపిస్తుందంటున్నారు ఆడియన్స్. ఈ సినిమా రివ్యూ పై నారా లోకేష్ కూడా ట్విట్ చేశారు. సినిమా అద్భుతంగా ఉందట. ప్రభాస్( PRABHAS) , అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణే ( DEEPIKA PADUKUNE) ప్రధాన పాత్రల్లో నటించిన భారీ చిత్రం కల్కి 2898 ఏడీ ( KALKI 2898 AD)  నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు అన్ని రివ్యూలు వారెవ్వా అనే రీతిలో వస్తున్నాయంటూ ట్వీట్ చేశారు.


"కల్కి 2898 ఏడీ చిత్రం రివ్యూలు అద్భుతంగా ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్ గారికి, అమితాబ్ బచ్చన్( AMITHABACHAN)  గారికి, కమల్ హాసన్ గారికి, దీపిక పదుకొనే( DEEPIKA PADUKUNE)  గారికి, దర్శకుడు నాగ్ అశ్విన్ ( NAG ASHWIN) గారికి నా అభినందనలు. తెలుగు ఇండస్ట్రీ స్థాయిని అంచలెంచెలుగా పెంచుతున్నందుకు గర్వంగా ఉంది.  కళాఖండం అనదగ్గ సినిమా. నిర్మాతలు అశ్వినీదత్( ASHWINIDATT) , స్వప్న, ప్రియాంకలకు ప్రత్యేక అభినందనలు. అన్ని సినీ సూత్రాలను తిరగరాసి తెలుగు సినిమాను అంతర్జాతీయ బరిలో నిలిపారు" అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.