Pushpa 2 The Rule: పుష్ప-2పై నేషనల్ మీడియా ఏం చెబుతుంది !

చిత్రబృందం 80 దేశాల్లో 12 వేల స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది. తెలుగు ఆడియన్స్ అయితే పుష్ప-2 కు 4.5 రేటింగ్ ఇచ్చారు. 


Published Dec 05, 2024 08:53:00 PM
postImages/2024-12-05/1733412431_Gd2mDd7W8AAybWs17332091537721733364388714.avif


న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, డైరక్టర్ సుకుమార్ కాంభినేషన్ లో వచ్చిన మూవీ పుష్ప-2 ది రూల్ పై నేషనల్ మీడియా ఏం చెబుతుంది. పుష్ప అయితే అన్ని ఇండస్ట్రీస్ లోను సూపర్ డూపర్ హిట్టు.  హిందీ లో అయితే జనాలు వెర్రెత్తిపోయారు. ఇఫ్పుడు పార్ట్ 2 కి ఆ సినిమా నే ప్రమోషన్స్ లేకుండా నెట్టుకొచ్చింది. అందుకు తగ్గట్టుగానే చిత్రబృందం 80 దేశాల్లో 12 వేల స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది. తెలుగు ఆడియన్స్ అయితే పుష్ప-2 కు 4.5 రేటింగ్ ఇచ్చారు. 


సుకుమార్ ను పొగడ్తలతో ముంచెత్తారు. పాన్ ఇండియా లెవల్లో ఇంట్రస్ట్ ఉన్నా ..నేషనల్ మీడియా అసలు పుష్ప కోసం ఏం చెబుతున్నారనేది చూసేద్దాం. ఇండియా టుడే, ఎన్డీటీవీలు పుష్ప-2 చిత్రంపై పెదవి విరిచాయి. పుష్ప-2 చిత్రం తన బరువు కింద తానే నలిగిపోయిందని ఎన్డీటీవీ పేర్కొనగా... అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూనే, ఈ చిత్రంలో కథను వెనక్కి నెట్టేశారని ఇండియా టుడే వెల్లడించింది.  కాని ఎక్కడ సుకుమార్ డైరక్షన్ బాలేదని కాని ..అల్లుఅర్జున్ బాగా నటించలేదని కాని అనలేదు. అంతేకాదు బాలీవుడ్ జనాలకు ఎక్కడ దంగల్ ను బీట్ చేస్తుందేమోననే భయం కూడా ఉంది.


టైమ్స్ ఆఫ్ ఇండియా మాత్రం పాజిటివ్ రివ్యూ ఇచ్చింది. టైమ్స్ నౌ మీడియా సంస్థ కూడా పుష్ప-2 మామూలు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ పేర్కొంది. ది హిందూ అయితే పొగడ్త ను పొగడలేక ..బాగుందని చెబితే ఏమంటారో అనే ఇది నచ్చలేదంటు రివ్యూ ఇచ్చింది. ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత స్పీడ్ సెకండ్ పార్ట్ లో లేదని చెప్పింది. కాగా, పుష్ప-2 సినిమాపై నెలకొన్న భారీ హైప్ తో జాతీయ మీడియా సంస్థల్లో చాలా వెబ్ సైట్లు లైవ్ కవరేజీ ఇస్తున్నాయి. అయితే ఆడియన్స్ కు సినిమా నచ్చేసింది. సూపర్ డూపర్ హిట్ అంటున్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pushpa2 review national-media

Related Articles