"ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః" అని ఆ తల్లిని ప్రార్ధిస్తే సమస్త కోరికలు ఈడేరుతాయి. సకల దేవత మంత్రాలకు గాయత్రీ మంత్రంతో ప్రజలకు అనుబంధం ఉంటుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపు రెండో రోజు. అమ్మవారి నవరాత్రుల్లో రెండు రోజు దుర్గమ్మ గాయిత్రి దేవిగా దర్శనమివ్వనున్నారు. అమ్మ వేదాలకు అధిపతి.సకల వేద స్వరూపం గాయత్రి దేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాత. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. అమ్మను పూజిస్తే మంత్రశక్తి కలుగుతుందని నమ్ముతారు. అందుకే జ్యోతిష్యం చెప్పే బ్రహ్మాణులు ఎక్కువగా గాయిత్రీ ఉపాసన చేస్తారు.
"ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః" అని ఆ తల్లిని ప్రార్ధిస్తే సమస్త కోరికలు ఈడేరుతాయి. సకల దేవత మంత్రాలకు గాయత్రీ మంత్రంతో ప్రజలకు అనుబంధం ఉంటుంది. గాయిత్రీ మంత్రం ఒక్కటి చాలు ..మానవ జీవితానికి అమ్మ తోడుగా నిలబడడానికి అని నమ్ముతారు. సమస్త దేవాతా మంత్రాలకు చివర గాయత్రి చేర్చి , రుద్ర గాయిత్రీ , విష్ణు గాయిత్రీ , లక్ష్మీ గాయిత్రీ , గణేష గాయిత్రీ ఇలా ప్రతి మంత్రంతో తలుచుకుంటే చాలా మంచిది.
సకల దేవతలు నివేదించే పదార్ధాలన్నీ గాయత్రీ మంత్రంతో సంప్రోక్షించిన తర్వాతే దేవతలకు నివేదిస్తారు. జ్ఞాన ప్రదాయిని అయిన గాయత్రీ మాతను పూజిస్తే జ్ఞానం, ఐశ్వర్యం లభిస్తాయి. నారింజ రంగు వస్త్రాలతో అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది.కనకంబరాలతో+అమ్మకు పూజ చేసి కొబ్బరి అన్నం నివేదన చెయ్యాలి.