సహజీవనం చేస్తూ దగ్గర్లో ఉన్న కంపెనీ లో పనిచేస్తున్నారు. అమ్మాయి పేరు అమృత..గర్భం దాల్చింది. అయితే ఆ విషయం తనకు తెలీలేదు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రీసెంట్ గా హాస్పటిల్ లో జరిగిన ఘటన అందరి మనసు కలిచివేసింది. బెంగుళూరులో జరిగిన ఈ సంఘటన సభ్యసమాజాన్ని సిగ్గు పడేలా చేసింది. బెంగుళూరులో ఓ కంపెనీ లో నేపాలీనుంచి వచ్చిన ఓ జంట పనిచేస్తున్నారు. సహజీవనం చేస్తూ దగ్గర్లో ఉన్న కంపెనీ లో పనిచేస్తున్నారు. అమ్మాయి పేరు అమృత..గర్భం దాల్చింది. అయితే ఆ విషయం తనకు తెలీలేదు.
పొట్టకూడా పెద్దగా లేకపోవడంతో తనకు గర్భవతిననే అనుమానం రాలేదు. హార్మోనల్ ఇష్యూస్ తో పీరియడ్స్ ఇష్యూని పెద్దగా పట్టించుకోలేదు. ఇలా నెలలు పూర్తిగా నిండాక తను గర్భవతిననే విషయం తెలిసింది. నొప్పులు రావడంతో హాస్పటిల్ బాత్రూమ్ లో బిడ్డకు జన్మనిచ్చి టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేసింది. తర్వాత జంట ఇద్దరు ఇంటికి వెళ్లిపోయారు. బాత్రూమ్ లో రక్తస్రావాన్ని చూసిన హాస్పటిల్ సిబ్బంది సీసీ కెమరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.