OTT: OTT లోకి మలయాళ క్రైమ్ కామెడీ మూవీ ‘నూనక్కుజి’.. ఫుల్ ఫన్ !

ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ నే సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోనీ ప్రధాన పాత్రలలో నటించారు. 


Published Aug 29, 2024 02:48:00 PM
postImages/2024-08-29/1724923192_hqdefault.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మలయళ సినిమాలకు జనాలు బాగా కనెక్ట్ అవుతున్నారు. మలయాళం సినిమాలకు ..ఫీల్ గుడ్ మూవీస్ అనే పేరుంది. వాళ్లు స్లో అండ్ స్టడీ గా సినిమాలు తీస్తుంటారు. ఇక వీటిలో లవ్ , రొమాన్స్ జోనర్స్ భలే క్లిక్ అవుతున్నాయి. ఇక వీటిలో కామెడీ సస్పెన్స థ్రిల్లర్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే హార్రర్ సినిమాల తర్వాత అందరూ ఎక్కువగా ఇష్టపడేది కామెడీ టచ్ నే. జనాలు హాడావిడి లైఫ్ లో నవ్వుకోవడానికే సినిమాలు చూడాలనుకుంటున్నారు.అలాంటి సినిమానే నూనక్కుజి.


ఈ సినిమా పేరు ‘నూనక్కుజి’.. ఈ సినిమాకు మలయాళ స్టార్ డైరెక్టర్ జీతు జోసెఫ్ డైరక్ట్ చేశారు. ఈ సినిమా ఆగస్ట్15 న థియేటర్ లో రిలీజ్ అయింది.అప్పుడే ఓటీటీ రిలీజ్ కు కూడా సిధ్ధమయ్యింది. ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ నే సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోనీ ప్రధాన పాత్రలలో నటించారు. 


ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 13 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మళయాళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారట మేకర్స్ . ఫస్ట్ మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. తర్వాత తెలుగులో డబ్ చేస్తారంటున్నారు మూవీ టీం. 

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu comedians telugu-news malayala-industry

Related Articles