పవన్ కళ్యాణ్ , ఆద్య తో పాటు చిన్న కూతురు పలీనా అంజని కొణిదెల ఇప్పటికే తిరుమల చేరుకున్నారు. అయితే పలీనా క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇద్దరి కూతుర్లతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ , ఆద్య తో పాటు చిన్న కూతురు పలీనా అంజని కొణిదెల ఇప్పటికే తిరుమల చేరుకున్నారు. అయితే పలీనా క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చింది.
టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ కూతురు సంతకం చేశారు. అయితే పలీనా ఇంకా మైనర్ కావడంతో ...పవన్ కళ్యాణ్ గార్డియన్ గా సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రీసెంట్ గా మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన లో భాగంగా డిక్లరేషన్ వివాదం వచ్చింది. దీని లో భాగంగా హిందువులు కాని ఏ మతస్థులైనా డిక్లరేషన్ పై సంతకాలు చేశాకే శ్రీవారి దర్శనమని కూటమి పార్టీలతో పాటు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి.ఈ వివాదం నడుస్తోన్న వేళ పవన్ కల్యాణ్ తన కూతురితో డిక్లరేషన్ పై సంతకం చేయించడం కాస్త స్పెషల్ .
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్ష ముగింపుకు తిరుమల చేరుకున్నారు. ఇఫ్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ చిన్న కూతురు పలీనా ఎప్పుడు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఆమె పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది..