సినిమాటిక్ వరల్డ్ సమర్పణలో K.Y.బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మాణంలో అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పెళ్లి కాని ప్రసాద్ మూవీ కమెడియన్ సప్తగిరి , థామ మీడియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పణలో K.Y.బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మాణంలో అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సప్తగిరి పెళ్లి కాని ప్రసాద్ సినిమా నేడు మార్చ్ 21న థియేటర్స్ లో విడుదల అయింది. అసలు సప్తగిరి హిట్టు కొట్టాడో లేదో చూద్దాం.
స్టోరీ లోకి వెళ్తే ...ప్రసాద్ (సప్తగిరి) మలేషియాలో ఓ స్టార్ హోటల్ లో పని చేస్తూ ఉంటాడు. కట్నం ఎక్కువ తీసుకోవాలని 38 ఏళ్ల వయసు వరకు పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. అయితే ప్రసాద్ తండ్రి తన పూర్వీకుల కట్నం హిస్టరీ చెప్పి 2 కోట్ల కట్నం అయితేనే పెళ్లి చేసుకుంటామంటూ ప్రసాద్ కు పెళ్లి చెయ్యడు. అదే ఊరిలో ఉండే ప్రియ ( ప్రియాంక శర్మ) ప్రసాద్ కి పరిచయం అవుతుంది. ప్రియ తన తల్లితండ్రులు, అమ్మమ్మతో కలిసి ఫారిన్ లో ఉంటున్న అబ్బాయిని పెళ్లి చేసుకొని ఫారిన్ లో సెటిల్ అవ్వాలని కలలు కంటుంది. ప్రసాద్ మలేషియా లో ఉంటాడని తెలిసి అతన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసేసుకోవాలనుకుంటాడు. అసలు పెళ్లి జరిగిందా...ఎలా ట్రాప్ జరిగిందనేది స్టోరీ.
పెళ్లి కోసం ఎదురుచూస్తూ ఫారెన్ లో ఉన్న ప్రసాద్, వాళ్ళ నాన్న ఇక్కడ కట్నం కోసం ఎదురుచూపులు, ఆ తర్వాత హీరో ఊరికి వచ్చి పెళ్లి ప్రయత్నాలతో సాగుతుంది. ప్రసాద్ ఫారన్ వెళ్లాడు అని తెలియడంతో ఆ తర్వాత నుంచి మరింత ఆసక్తిగా మారి కామెడీతో నవ్వించారు. డైరక్టర్ సప్తగిరితో నవ్వించడానికి చాలా ట్రై చేశాడు. కొన్ని సీన్స్ లో మాత్రం మరీ ఓవర్ అనిపిస్తుంది. కాని కామెడీ వర్కవుట్ కాలేదు . క్లైమాక్స్ ఇంకాస్త బెటర్ అయితే బాగుండేది. సినిమా ఏవరేజ్ గా ఆడేస్తుంది. పర్వాలేదు. జనాలు కామెడీ సినిమాలను ఆదరిస్తారు.