ఆదివారం రోజు పలాస నేషనల్ హైవే మీద జరిగిన యాక్సిడెంట్ లో మాధురి కారు నుజ్జునుజ్జయింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతోనే యాక్సిడెంట్ చేశానని.. తనను చనిపోనివ్వాలని.. చికిత్స చేయొద్దంటూ హాస్పిటల్ లో మాధురి డ్రామా చేసింది.
న్యూస్ లైన్ డెస్క్ : సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రోజుకో మలుపు తిప్పుతున్న ఈ స్టోరీలో ఆత్మహత్య చేసుకుంటా అని స్పీడ్ గా కారు నడిపిన మాధురి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆదివారం రోజు పలాస నేషనల్ హైవే మీద జరిగిన యాక్సిడెంట్ లో మాధురి కారు నుజ్జునుజ్జయింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతోనే యాక్సిడెంట్ చేశానని.. తనను చనిపోనివ్వాలని.. చికిత్స చేయొద్దంటూ హాస్పిటల్ లో మాధురి డ్రామా చేసింది. ఈ ప్రమాదంలో మాధురికి గాయాలయ్యాయి. విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆమెకు వైద్యం చేస్తున్నారు. చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని.. తీవ్రమైన తలనొప్పి ఉందని వైద్యులు తెలిపారు.
అయితే.. పోలీసులు మాత్రం ఆమెకు వేరేలా ట్విస్ట్ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న నెపంతో మీ నిర్లక్ష్యం ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించారు అంటూ మాధురి మీద కేసు నమోదు చేశారు. కొత్త న్యాయ చట్టాల్లో 125 సెక్షన్ ప్రకారం దివ్వెల మాధురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో తలెత్తిన వివాదానికి దివ్వెల మాధురి ముఖ్య కారణంగా నిలిచింది. నాలుగు రోజులుగా దువ్వాడ ఇంటి ముందు ఆయన భార్యాబిడ్డలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దువ్వాడ వాణి.. మాధురిల మధ్య గొడవ పెద్దదవుతోంది. ఈ సమయంలో మాధురి కారుకు యాక్సిడెంట్ కావడం సంచలనం సృష్టించింది. ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అంటూ మాధురి ప్రకటించిన విషయం తెలిసిందే.