Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

ప్రస్తుతం ఫౌజీ వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ప్రభాస్ కొత్త సినిమా శనివారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో అధికారికంగా ప్రారంభించింది చిత్ర బృందం. ఈ సినిమాలో ప్రభాస్ లీడ్ రోల్ లో కనిపించనున్నారు. 


Published Aug 17, 2024 07:11:29 AM
postImages/2024-08-17/1723896660_fauji.jpg

న్యూస్ లైన్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన భిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే కల్కి 2898ADతో హిట్ అందుకున్న జోష్ లో ఉన్న ఫ్యాన్స్‌కు ఇది మరింత కిక్ ఇస్తోంది. ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ గ్లింప్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ప్రస్తుతం ఆయన చేతిలో స్పిరిట్ ప్రాజెక్టు కూడా ఉంది. దీనికి తోడు తాజాగా మరో సినిమా వచ్చి చేరింది. ఇక ఇదంతా చూస్తుంటే ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నట్లు ఉంది. 

ప్రస్తుతం ఫౌజీ వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ప్రభాస్ కొత్త సినిమా శనివారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో అధికారికంగా ప్రారంభించింది చిత్ర బృందం. ఈ సినిమాలో ప్రభాస్ లీడ్ రోల్ లో కనిపించనున్నారు. ఇమాన్ ఎస్మైల్ ఇందులో హీరోయిన్‌గా కనిపించనుంది. డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా రానుంది. త్వరలోనే సినిమా షూటింగ్ పనులు కూడా స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. 

newsline-whatsapp-channel
Tags : prabhas news-line newslinetelugu cinema-news fauji prabhashanu faujipoojaceremony

Related Articles