Balakrishna:బాలకృష్ణతో ఆ పని చేయబోతున్న ప్రగ్యా జైస్వాల్.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ అంటే తెలియని వారు ఉండరు.  ఈయన కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా  మంచి ఫామ్ లో ఉన్నారు. నాకు తెలిసినంతవరకు రాజకీయాలను సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్న ఏకైక ట్యాలెంటెడ్ హీరో అని చెప్పవచ్చు. అలాంటి బాలకృష్ణ  ఇప్పటికీ ఆరు పదుల వయస్సు దాటినా కానీ సినిమాల్లో ఫుల్ క్రేజ్ తో నటిస్తున్నారు.  అలాంటి బాలయ్యకు ఏదైనా సినిమాలో హీరోయిన్ నచ్చితే ఆ హీరోయిన్ తోనే ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటారు.


Published Jul 11, 2024 07:09:23 AM
postImages/2024-07-11/1720699680_pragya.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ అంటే తెలియని వారు ఉండరు.  ఈయన కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా  మంచి ఫామ్ లో ఉన్నారు. నాకు తెలిసినంతవరకు రాజకీయాలను సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్న ఏకైక ట్యాలెంటెడ్ హీరో అని చెప్పవచ్చు. అలాంటి బాలకృష్ణ  ఇప్పటికీ ఆరు పదుల వయస్సు దాటినా కానీ సినిమాల్లో ఫుల్ క్రేజ్ తో నటిస్తున్నారు.  అలాంటి బాలయ్యకు ఏదైనా సినిమాలో హీరోయిన్ నచ్చితే ఆ హీరోయిన్ తోనే ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటారు.

ఈ విధంగా అయితే ఈమధ్య సీజన్ లో మాత్రం ఆ ఛాన్స్ ప్రగ్యాకే   దక్కిందని చెప్పవచ్చు. లెజెండ్ మూవీలో బాలయ్య సరసన కథానాయక చేసింది ఈ సినిమా సూపర్ హిట్. దీని తర్వాత ఈ అమ్మడు  బాలకృష్ణతో అఖండ 2 చేయబోతుందట. దీనికోసం డైరెక్టర్ బోయపాటి శ్రీను  అద్భుతమైనటువంటి కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ మళ్లీ ప్రగ్యాకే దక్కిందని తెలుస్తోంది.

అఖండలో కనిపించినటువంటి పాత్రలు  అఖండ2 లో కంటిన్యూ అవుతాయట. ఇందులో ప్రగ్యా కూడా ఒకటి.  అంతేకాకుండా బాలకృష్ణ బాబి కాంబినేషన్ లో మరో మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలుసు. ఇందులో హీరోయిన్ గా ఊర్వసి రోటేలాను ఫిక్స్ చేశారు. కానీ ఇందులో మరో హీరోయిన్ గా ప్రగ్యాని కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాతో ఆమె హ్యాట్రిక్ కొడుతుందని తెలుస్తోంది.

అంతేకాకుండా ప్రగ్యా జైస్వాల్ కూడా ఈ మధ్య కాలంలోనే సెట్లోకి కూడా వచ్చిందని, సమాచారం. అఖండ మూవీ తర్వాత ప్రగ్యా జైష్వాల్ ను ఇండస్ట్రీలో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.  కానీ మళ్ళీ బాలయ్య సినిమాతోనే ఆమె మరోసారి హీరోయిన్ గా వస్తుండడం ఆమె అదృష్టం అని చెప్పాలి.  అఖండ2 కు సంబంధించిన స్క్రిప్ట్ తుదిమెరుగులు దిద్దుతున్నట్లు దర్శకుడు బోయపాటి శ్రీను తెలియజేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

newsline-whatsapp-channel
Tags : newslinetelugu balakrishna boyapati-srinu akhanda2 pragya-jaishwal

Related Articles