ప్రస్తుత కాలంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు ఎవరు అధికారంలో ఉన్న ఆపోజిట్ పార్టీ వారిని కాస్త గౌరవించుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఒక పార్టీ గెలిచి ఇంకో పార్టీ ఓడిపోయింది
న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుత కాలంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు ఎవరు అధికారంలో ఉన్న ఆపోజిట్ పార్టీ వారిని కాస్త గౌరవించుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఒక పార్టీ గెలిచి ఇంకో పార్టీ ఓడిపోయింది అంటే ఆ పార్టీ నాయకులను చిత్రహింసలకు గురిచేసి వారిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు కొంతమంది నాయకులు అయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి దగ్గరికి వెళ్లి జోకేస్తున్నారు. అలా జగన్ అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కి విమర్శించినటువంటి కొంతమంది నటులు ఇప్పుడు కాళ్లభేరానికి వచ్చారు. వారెవరు ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ పృథ్వి అంటే తెలియని వారు ఉండరు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ కామెడీ చేసి ఎంతో గుర్తింపు పొందారు. అలాంటి పృథ్వి రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో టిడిపి నాయకులను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా విమర్శించారు. ఆయనను ఎంత తిడితే అంత మంచి పదవి వస్తుందని ఆశించి చివరికి పవన్ కళ్యాణ్ సొంత లైఫ్ లోకి కూడా దూరిపోయి విమర్శలు చేశాడు.
ఆయన ప్రతిభను గుర్తించిన వైసీపీ అధిష్టానం ఎస్వీబీసీ చైర్మన్ పదవి అందించింది. కానీ దాన్ని కాపాడుకోలేకపోయాడు. కుక్క తోక వంకర అన్నట్టు ఆ పదవిలో ఉంటూ అమరావతి రైతుల గురించి వ్యంగ్యంగా మాట్లాడాడు. అంతేకాదు ఆడి కార్లు, బంగారు గాజులు, ఖద్దర్ చొక్కాలు వేసుకొని ఉద్యమం చేస్తున్నవారు రైతులా అంటూ విమర్శించాడు. అలాగే చంద్రబాబు అమరావతిలో రేకుల షెడ్లు నిర్మిస్తే అద్భుతమైన నిర్మాణం అని పవన్ కళ్యాణ్ ఊదరగొడుతున్నారంటూ విమర్శలు చేశారు. చివరికి ఎస్వీబీసీ పదవిలో ఉంటూ అక్కడే ఒక మహిళ ఉద్యోగిని వేధించారని ఆడియో బయటకు రావడంతో ఆయనను ఆ పదవి నుంచి పీకేశారు.
ఇక అప్పటినుంచి రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయాడు పృథ్వి. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందే బ్రతిమిలాడి కాళ్లు పట్టుకొని పవన్ పంచన చేరాడు. తాను చేసిన తప్పులను తెలుసుకొని క్షమించమని అడిగాడు. దీంతో పవన్ కళ్యాణ్ కూడా క్షమించి వదిలేయడంతో ప్రస్తుతం జనసేన పార్టీలో చేరిపోయాడని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్న వీడియో సంబంధించి ప్రస్తుతం జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తున్నావు బుద్ధుందా నీకు అంటూ కామెంట్లు పెడుతున్నారు.