ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలు చాలామంది పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇదంతా ఇండస్ట్రీ ఎదుగుదలకు ఉపయోగపడుతున్నా కానీ దర్శక నిర్మాతలకు మాత్రం తలకు
న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలు చాలామంది పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇదంతా ఇండస్ట్రీ ఎదుగుదలకు ఉపయోగపడుతున్నా కానీ దర్శక నిర్మాతలకు మాత్రం తలకుమించిన భారంలా తయారవుతోంది. ఒక హీరో ఒకటి రెండు పాన్ ఇండియా స్థాయిలో హిట్లు కొడితే చాలు తన రెమ్యూనరేషన్ ఏకంగా వందలాదికోట్లకు పెంచేస్తున్నారట. ఇలా హీరోనే అన్ని కోట్లు తీసుకుంటే ఇక మిగతా ఖర్చుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.
సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ నిర్మాత కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారట. అలా తాజాగా రామ్ చరణ్ కూడా అదే ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. దీంతో దర్శక నిర్మాతలు సీరియస్ అయినట్టు సమాచారం. ఆ వివరాలు ఏంటో చూద్దాం..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా షూటింగ్ లో ఉన్నారు.దీని తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతున్న 16వ చిత్రానికి ఈ మధ్యకాలంలోనే పూజ కార్యక్రమాలు చేశారు. అయితే ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత ఆయన 17వ సినిమా సుకుమార్ డైరెక్షన్ లో చేయబోతున్నారట.
అయితే 16వ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన అంతగా హైప్ రాలేదు, కానీ 17వ సినిమా గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన రామ్ చరణ్ పారితోషికం 30 నుంచి 40 కోట్ల మధ్య తీసుకునేవారు. అయితే రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో వచ్చే సినిమా కోసం ఏకంగా 100 కోట్ల వరకు పారితోషకం అడుగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా పాన్ ఇండియా స్టార్స్ అంతా 100 కోట్ల పారితోషికాన్ని పెంచితే సినిమాలు తీయడం ఎలా అని నిర్మాతలు భయపడిపోతున్నారట.
ఇలాగైతే పూర్తిగా సినిమాలు తీయడం మానేస్తామని అంటున్నారట. ఒకప్పుడు నిర్మాతలు అంటే హీరో హీరోయిన్లకు ఇతర నటీనటులకు కూడా గౌరవం ఉండేదని, ఆ గౌరవం ఇప్పుడు పోయిందని పూర్తిగా సినిమా స్టార్లు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టె నిర్మాతలు అస్సలు ఉండారని వారు అంటున్నారట. మరి ఇందులో నిజం ఎంతో అబద్ధం ఏంటో తెలియదు కానీ సోషల్ మీడియాలో వార్త మాత్రం వైరల్ అవుతుంది.