Bigg Boss 8 Telugu: విష్ణుప్రియకు బ్రేకప్ చెప్పిన పృథ్వీ!

ఈ సీజన్ లో విష్ణు ప్రియ , పృథ్వీ . అయితే ఎపిసోడ్ ఇప్పుడు మరింత హీట్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రేరణ , విష్ణుప్రియ , పృథ్వీ మధ్య ఫైర్ మామూలుగా లేదు.


Published Oct 23, 2024 10:10:00 AM
postImages/2024-10-23/1729658541_1500x900545559hyrdlbgfdv.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  బిగ్ బాస్ లో ప్రతి సీజన్ లోను ఏదో ఒక లవ్ స్టోరీ నడుస్తునే ఉంటుంది. ఈ సీజన్ లో విష్ణు ప్రియ , పృథ్వీ . అయితే ఎపిసోడ్ ఇప్పుడు మరింత హీట్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రేరణ , విష్ణుప్రియ , పృథ్వీ మధ్య ఫైర్ మామూలుగా లేదు.


పృథ్వీని ఎవరైనా నామినేట్ చేస్తే మధ్యలోకి దూరిపోయి మరీ గొడవ పెట్టేసుకుంది విష్ణు.. దీంతో ప్రేరణ పాయింట్ టూ పాయింట్ అడిగేసింది. పృథ్వీ కోసమే గేమ్ అంటూ ప్రేరణతో గొడవ పెట్టుకుంది యష్మీ. ఇక నామినేషన్స్ ప్రక్రియ ముగియగానే సీరియల్ బ్యాచ్ మొత్తం అర్దరాత్రి ముచ్చట్లు పెట్టుకుంది.  యష్మి పృథ్వీకి గట్టిగానే క్లాస్ పీకింది. ఇి ఇండివిడ్యుయల్ గేమ్ ...నువ్వు విష్ణు ని అలా అంటిపెట్టుకు తిరుగుతుంటే చాలా చిరాకు గా ఉంది. నీ ఇంట్రస్ట్ గేమ్ ను ఇరిటేట్ చెయ్యకూడదు. అంటు గట్టిగా క్లాస్ ఇచ్చింది యష్మీ.


నీకు ఆమెపై ఏదైనా ఫీలింగ్ ఉందా అంటూ అసలు విషయం అడిగేసింది యష్మీ. లేదు అన్నాడు పృథ్వీ. తను నీకు జస్ట్ ఫ్రెండ్ అంతేనా అని తిరిగి యష్మీ అడగ్గా అవును అంటూ ఆన్సర్ ఇచ్చాడు పృథ్వీ. నేను తన దగ్గరకు వెళ్లడం లేదు..తను వస్తే మాట్లాడుతున్నా.ఇక యష్మితో మాట్లాడిన తర్వాత విష్ణుతో మీటింగ్ పెట్టాడు పృథ్వీ. మనం ఓవర్ అయినట్లు నీకు అనిపిస్తుందా అని అడగ్గా… లేదు అని చెప్పింది విష్ణు.


నా పై ఫీలింగ్స్ ఉంటే ఇక్కడితో ఆపేద్దాం అంటూ విష్ణు కు చెప్పాడు. విష్ణు కూడా తనతో నవ్వుతూ సరే డన్ అంటూ అక్కడితో వదిలి వెళ్లిపోయి బెడ్ పై పడుకుంది. నబీల్ తన బాధనుచూసి మంచి మొగుడు వస్తాడు బాధపడకు అని సలహా ఇచ్చాడు నబీల్.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu love bigboos8 vishnu-priya pruthvi-

Related Articles