Pushpa 2: పుష్ప 2 విలన్ నయా లుక్ పోస్టర్ రిలీజ్

గురువారం మేకర్స్ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ షేర్ చేశారు


Published Aug 08, 2024 06:35:26 AM
postImages/2024-08-08/1723113564_fahad.PNG

న్యూస్ లైన్ సినిమా: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్‌ అవెయిటెడ్ సినిమా ‘పుష్ప ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇక గురువారం మేకర్స్ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ షేర్ చేశారు. 

ఈ మూవీ నుంచి విలన్ ఫహద్‌ ఫాసిల్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా మూవీయూనిట్ విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్‌లో ఫహద్ ఫాజిల్ ఓ చేతిలో గన్ పట్టుకుని, ఇంకో చేతిలో గొడ్డలి పట్టుకొని ఉన్న స్టిల్స్ ఆడియన్స్ ఆకట్టుకుంది. ఈ సినిమా డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. పుష్ప ది రూల్‌లో ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : tollywood allu-arjun pushpa2 rashmika-mandanna cinema-news new-post

Related Articles