వరద వస్తుందని ఖమ్మం ప్రజలకు ముందు చెప్పలేదు.. ఇదే ప్రభుత్వ ఫెయిల్యూర్ అని ఆయన విమర్శించారు. వరదలు పగటి సమయంలోనే వచ్చాయి కాబట్టి ప్రజలు వారిని వారు రక్షించుకున్నారని ఆయన అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి, BRS నేత పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ హాస్పిటల్ నిర్మించారని ఆయన అన్నారు. పువ్వాడకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తాజగా, సీఎం చేసిన వ్యాఖ్యలపై అజయ్ కుమార్ స్పందించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి తనపై ఆరోపణలు చేశారని అన్నారు.
వరద వస్తుందని ఖమ్మం ప్రజలకు ముందు చెప్పలేదు.. ఇదే ప్రభుత్వ ఫెయిల్యూర్ అని ఆయన విమర్శించారు. వరదలు పగటి సమయంలోనే వచ్చాయి కాబట్టి ప్రజలు వారిని వారు రక్షించుకున్నారని ఆయన అన్నారు. నైట్ టైంలో వచ్చి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని ఆయన అన్నారు. శనివారం రోజు 21 అడుగులకు నీటిమట్టం చేరింది, 21 అడుగులకు చేరినా ఒక ఇల్లు కూడా మునగదని ఆయన వెల్లడించారు. ఆదివారం ఉదయం 33 అడుగులకు నీటిమట్టం చేరింది, అప్పటికి ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు గాని అనౌన్స్మెంట్ గాని చేయలేదని పువ్వాడ అన్నారు.
ప్రజలే స్వచ్ఛందంగా అయ్యో రామచంద్ర అని అనుకుంటూ వారి సామాగ్రిని వదిలేసి వేరే ప్రాంతంలోకి వెళ్లిపోయారని ఆయన తెలిపారు. తమకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని ప్రజలే ఆరోపిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. రిలీఫ్ మెజర్స్ తీసుకోవడంలో బాధితులకు ఆహారం, నీళ్లు అందించడంలో సర్కార్ విఫలమైందని ఆయన వెల్లడించారు. వీటన్నిటి నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే తనపై రేవంత్ అనవసరపు ఆరోపణలు చేశారని ఆయన తెలిపారు.