ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
న్యూస్ లైన్ డెస్క్: నేడు, రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఈరోజు కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ బాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు ఉండగా.. ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని వెల్లడించారు. ఈ జిల్లాలకు చెందిన రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.