డ్రైనేజీని క్లియర్ చేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి.
న్యూస్ లైన్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో ఉన్న సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనంలోకి వరద చేరింది. దీంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాతప్రమాదం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD)కి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత సంఘటన స్థలంలో మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(MCD)కి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనకు దిగారు. డ్రైనేజీని క్లియర్ చేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి.
తాజగా, ఈ అంశంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ వంటి ఘటనలు ఇక్కడా జరిగే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిమయమైందని ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త కమిషనర్ టౌన్‌ప్లానింగ్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. టౌన్‌ప్లానింగ్‌ను సీఎం ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.
అయితే, గోషామహల్‌లో కొత్తగా వేసిన రోడ్డు కుంగిపోయింది. దీంతో ఆ రోడ్డుపై వెళ్తున్న డీసీఎం వాహనం ఒకటి బోల్తా పడిపోయింది. వాహనం పక్కన ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక గోషామహల్ ఎమ్మెల్యే మాటలు విన్న వారంతా.. సొంత నియోజకవర్గంలోని సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే.. ఢిల్లీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.