RASHMIKA: రష్మిక కు ఆ ఫుడ్ అంటే అలర్జీ అట !

తను ప్యూర్ వెజ్ అని తనకు వెజ్ లో చాలా ఐటమ్స్ లో అలర్జీస్ ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


Published Aug 18, 2024 10:16:00 AM
postImages/2024-08-18/1723956430_rashmikamandanna0646321916x90.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రష్మిక మందన్నాగురించ ి కి భయంకరమైన ఫుడ్ అలర్జీస్ ఉన్నాయట. అది కూడా ఒక్క ఐటమ్ కాదు..చాలా ఐటమ్స్ తనకు అలర్జీస్ ఉన్నాయని స్వయంగా తను చెప్పింది. అంతేకాదు తను ప్యూర్ వెజ్ అని తనకు వెజ్ లో చాలా ఐటమ్స్ లో అలర్జీస్ ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


అమ్మడుకి టమోటాలు, బంగాళదుంపలు, ముల్లంగి దుంపలు, నేలలో పెరిగే దుంప జాతులంటే తనకు అలర్జీ వస్తుందట. అంతేకాదు తనకు ఇవి తిన్న వెంటనే స్కిన్ అంతా రెడ్ ప్యాచ్ వస్తాయని తెలిపింది. తన ఫ్రెండ్స్ అంతా నువ్వు అసలు ఏం తింటావ్ అంటూ ఏడిపిస్తారని నవ్వింది.


ఓ సారి సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిందట ఈ బ్యూటీ అక్కడ జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను షేర్ చేసింది. తను పిజ్జా తినడానికి వెళ్లిందట. ఇంతలో తనకు ఫుడ్ అలర్జీ ఉందనే విషయం గుర్తు వచ్చింది. తన పిజ్జా కోసం అక్కడ వ్యక్తికి ..క్యాప్సికం , మరియు టమోటా సాస్ , పొటాటోస్ లాంటివి ఏం వెయ్యొద్దని చెప్తే అక్కడ సేల్స్ పర్సన్ షాక్ అయిపోయాడని ...మీకు పిజ్జా చేయడం చాలా కష్టం మేడం అని ఫుల్ నవ్వుకున్నారట.


రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు ..పాన్ ఇండియన్ మూవీ పుష్ప-2 లో యాక్ట్ చేస్తుంది. అయితే అమ్మడు అదృష్టం బాగుండి అటు టాలీవుడ్ , తమిళ్ , బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్లిక్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫుల్ బిజీ గా ఉంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu food-habits rashmika-mandanna

Related Articles