Samantha: లండన్ హోటల్లో సమంత.. ప్రియుడుతో ఆ పని చేస్తూ..? 

సమంత ప్రస్తుతం ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ తో డేటింగ్ చేస్తుంది అనే వార్త గత కొద్ది రోజులుగా బీటౌన్ లో గుప్పుమంటుంది. ఇక ఈ వార్తకు తగ్గట్లే ఇన్ని రోజులుగా చూడని ఎన్నో ఫోటోలు మనం చూస్తూనే ఉన్నాం..


Published Sep 27, 2024 06:07:00 PM
postImages/2024-09-27/1727435851_samlondon.jpg

న్యూస్ లైన్ డెస్క్: సమంత ప్రస్తుతం ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ తో డేటింగ్ చేస్తుంది అనే వార్త గత కొద్ది రోజులుగా బీటౌన్ లో గుప్పుమంటుంది. ఇక ఈ వార్తకు తగ్గట్లే ఇన్ని రోజులుగా చూడని ఎన్నో ఫోటోలు మనం చూస్తూనే ఉన్నాం.. అప్పటివరకు సమంతతో రాజ్ అన్ని ఫోటోలు దిగారనే విషయం కూడా ఎవరికీ తెలియదు.

కానీ  ఎప్పుడైతే నాగచైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యారో అదే సమయంలో రాజ్ తో ఉన్న ఫోటోలు అన్నీ సమంత సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసింది.అయితే తాజాగా లండన్లో ప్రియుడితో సమంత తెగ ఎంజాయ్ చేస్తుంది అంటూ ఒక ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి ఇంతకీ సమంత ఏం చేస్తుంది..ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు చూద్దాం..

అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 7న స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్న హనీ బన్నీ వెబ్ సిరీస్ కు సంబంధించి ప్రీమియర్ కంటే ముందు గ్రాండ్ ప్రదర్శన కోసం లండన్ కి వెళ్లారు హనీ బన్నీ చిత్ర యూనిట్.. ఇందులో భాగంగా తాజాగా సమంత దర్శకుడు రాజ్ అలాగే రచయిత సీతతో కలిసి ఉన్న ఫోటోని అభిమానులతో షేర్ చేసుకుంది.

ఇక ఈ ఫోటో చూసిన చాలా మంది జనాలు హనీ బన్నీ ప్రమోషన్స్ కోసం వెళ్ళావా.. లేక ప్రియుడితో ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళావా అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.అయితే లండన్ కి కేవలం సమంత మాత్రమే కాదు హనీ బన్నీ చిత్ర యూనిట్ మొత్తం వెళ్లారు. ఇక స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్న హనీ బన్నీ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ సిటా డెల్ వెబ్ సిరీస్ కి రీమేక్ గా ఇండియన్ వెర్షన్ లో హనీ బన్నీ పేరుతో ఈ వెబ్ సిరీస్ రాబోతుంది

newsline-whatsapp-channel
Tags : news-line samantha naga-chaithanya director-raj honey-bunny-web-series citadel

Related Articles