Samantha: మరోసారి ఆసుపత్రిలో చేరిన సమంత ..పోస్ట్ వైరల్ !

సమంతకు మళ్లీ ఏమైందంటూ ఆమె ఆరోగ్యం పై ఆరాలు తీస్తూ గూగుల్ ను ఆరా తీస్తున్నారు. సమంత కొంతకాలంగా మయోసైటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే.


Published Mar 16, 2025 01:36:00 PM
postImages/2025-03-16/1742112703_samantha1116686643263x2.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ సమంత రీసెంట్ గా తన సోషల్ మీడియా అకౌంట్ లో తను హాస్పటిల్ బెడ్ పై ఉన్న పిక్ ను షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు. హాస్పటిల్ బెడ్ పై సమంత పడుకొని ఉండగా చేతికి సెలైన్ ఎక్కిస్తుండడం ఈ ఫొటోలో స్పష్టం గా కనిపిస్తుంది. దీంతో సమంతకు మళ్లీ ఏమైందంటూ ఆమె ఆరోగ్యం పై ఆరాలు తీస్తూ గూగుల్ ను ఆరా తీస్తున్నారు. సమంత కొంతకాలంగా మయోసైటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే.


అనారోగ్యం నుంచి కోలుకున్నాక ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్‌తో సమంత అభిమానుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్’ సినిమాలో నటిస్తున్న సమంత.. ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఫస్ట్ ప్రాజెక్ట్ శుభం షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇఫ్పుడు ఇలా హాస్పటిల్ లో ఉన్నట్లు పిక్స్ ను షేర్ చెయ్యడంతో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి, 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health samantha socialmedia

Related Articles