గవర్నమెంట్ పర్మిషన్ ఉన్న యాప్స్ నే విజయ్ దేవరకొండ ప్రమోట్ చేశారని తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బెట్టింగ్ యాప్స్ గొడవలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నట్లు ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతుంది. యూట్యూబర్లకే కాదు ..సినీ తారలకు కూడా బెట్టింగ్ యాప్ ల వ్యవహారం మెడకు చుట్టుకుంటుంది. దీనికి విజయ్ దేవరకొండ టీం వివరణ ఇచ్చింది. విజయ్ దేవరకొండ చట్టబద్ధమైన అనుమతులు ఉన్న గేమ్స్ కే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారని టీమ్ స్పష్టం చేసింది. అది కూడా స్కిల్ బేస్డ్ గేమ్స్ కే విజయ్ ప్రకటనలు చేశారని పేర్కొంది. గవర్నమెంట్ పర్మిషన్ ఉన్న యాప్స్ నే విజయ్ దేవరకొండ ప్రమోట్ చేశారని తెలిపారు.
అనుమతి ఉన్న ఏ23 అనే సంస్థ తరఫున విజయ్ దేవరకొండ పనిచేశారని వివరించింది. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిందని వెల్లడించింది. ఏ23 సంస్థతో విజయ్ దేవరకొండ ఒప్పందం గత సంవత్సరమే ముగిసిందని స్పష్టం చేసింది. ఇప్పుడు ఎలాంటి బెట్టింగ్ యాప్స్ తోను అగ్రిమెంట్స్ లేవని తెలిపారు.