Samantha : సోషల్ మీడియాలో సమంతా ప్రోగ్రెస్ కార్డ్ వైరల్


Published Sep 02, 2024 10:23:14 AM
postImages/2024-09-02/1725290522_SamanthaSSCProgressCard.jpg

న్యూస్ లైన్ డెస్క్ : తాజాగా పెళ్లి, ఎంగేజ్ మెంట్ అంటూ వార్తల్లో నిలిచిన టాలీవుడ్ బ్యూటీ సమంతా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సినిమా, క్లాత్ బ్రాండింగ్, గేమ్స్, స్కూల్ ఇలా చిన్నప్పటి నుంచి అన్నింటిలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. లేటెస్ట్ గా ఆమె పదో తరగతి మార్కుల షీట్ ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హాఫ్ ఇయర్లీ పరీక్షలకు చెందిన ప్రోగ్రెస్ రిపోర్టు కార్డులో సమంతా అన్ని సబ్జెక్టుల్లో 80  నుంచి 90 మార్కులు సాధించి క్లాస్ ఫస్ట్ గా నిలిచింది. మ్యాథ్స్ లో 100కి 100 మార్కులు కొట్టి మొత్తం 1000 మార్కులకు 887 మార్కులు సాధించింది.

సమంతా పదో తరగతి మార్కులు చూసిన నెటిజనులు బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ ఈ బ్యూటీని పొగుడుతున్నారు. గతంలో సైతం సమంతా మార్కుల షీట్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మరోసారి సమంతా పదో తరగతి హాఫ్ ఇయర్లీ మార్కుల షీటు ఆమె ఇన్ స్టా అకౌంట్ లో ట్రెండింగ్ గా నిలిచింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి వాయిస్ రైజ్ చేసిన సమంతా.. ఇండస్ట్రీలో మహిళలు స్వేచ్ఛగా పనిచేసుకునే పరిస్థితులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.

newsline-whatsapp-channel
Tags : samatha viral-news tollywood movie-news samantha latest-news news-updates telugu-news

Related Articles