Samantha: మరో వెబ్ సిరీస్ కి ఓకే చెప్పిన సమంత..?

స్టార్ హీరోయిన్ సమంత ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడిపేది.కానీ ఎప్పుడైతే మయోసైటిస్ బారిన పడిందో అప్పటినుండి ఆమె జీవితం మొత్తం తలకిందులైపోయింది. ఇక తనకి అంత పెద్ద వ్యాధి వచ్చినా కూడా సమంత ఎక్కడా కూడా బాధపడకుండా సినిమాలను కంటిన్యూ చేస్తోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో వెబ్ సిరీస్ కి ఓకే చెప్పినట్టు బీటౌన్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.ఇక అసలు విషయం ఏమిటంటే.. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సమంతకి ఎంతపెద్ద పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అదే బాటలో సిటా డెల్ వెబ్ సిరీస్ లో కూడా చేసింది. అయితే ఈ రెండు వెబ్ సిరీస్ లు కూడా రాజ్ అండ్ డీకే వారితో కలిసే సమంత చేసింది.అయితే త్వరలోనే వీరి కాంబినేషన్లో మరో వెబ్ సిరీస్ రాబోతుందట.అలాగే ఈ వెబ్ సిరీస్ కి రక్త బీజ్ అనే టైటిల్ ని పెట్టబోతున్నట్టు సమాచారం


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-06-29/1719640619_sam.jpg

న్యూస్ లైన్ డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడిపేది.కానీ ఎప్పుడైతే మయోసైటిస్ బారిన పడిందో అప్పటినుండి ఆమె జీవితం మొత్తం తలకిందులైపోయింది. ఫేస్ లో మొత్తం గ్లామర్ తగ్గి పేలగా తయారైపోయింది. అయితే ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుండి బయటపడుతూ మళ్లీ తన మునపటి ఫేస్ కట్ కోసం గ్లామర్ కోసం ఎన్నో కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే జిమ్ములలో శక్తికి మించి వ్యాయామాలు చేస్తూ తెగ కష్టపడుతోంది. ఇక తనకి అంత పెద్ద వ్యాధి వచ్చినా కూడా సమంత ఎక్కడా కూడా బాధపడకుండా సినిమాలను కంటిన్యూ చేస్తోంది.

ఇప్పటికే ఈమె మయాసైటీస్ బారిన పడ్డాక ఖుషి, శాకుంతలం వంటి సినిమాల్లో నటించింది. అలాగే బాలీవుడ్లో హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ లో కూడా చేస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో వెబ్ సిరీస్ కి ఓకే చెప్పినట్టు బీటౌన్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.ఇక అసలు విషయం ఏమిటంటే.. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సమంతకి ఎంతపెద్ద పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అదే బాటలో సిటా డెల్ వెబ్ సిరీస్ లో కూడా చేసింది. అయితే ఈ రెండు వెబ్ సిరీస్ లు కూడా రాజ్ అండ్ డీకే వారితో కలిసే సమంత చేసింది.

అయితే త్వరలోనే వీరి కాంబినేషన్లో మరో వెబ్ సిరీస్ రాబోతుందట. ఇక ఆ వెబ్ సిరీస్ లో సమంత పూర్తిగా యాక్షన్ మోడ్ లోనే కనిపిస్తుందని,దీనికోసం ఇప్పటికే నటుడు ఆదిత్య,సమంత ఇద్దరూ కసరత్తులు కూడా మొదలెట్టేసినట్టు టాక్ వినిపిస్తోంది.అలాగే ఈ వెబ్ సిరీస్ ఆగస్టులో పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ వెబ్ సిరీస్ కి రక్త బీజ్ అనే టైటిల్ ని పెట్టబోతున్నట్టు సమాచారం

newsline-whatsapp-channel
Tags : newslinetelugu samantha raj-and-dk adithya rakhtabeej

Related Articles