వరుస చోరీలకు పాల్పడుతున్న థార్ దొంగల ఆట కట్టించారు సంగారెడ్డి పోలీసులు. ఆగి ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులలో నగలు, విలువైన వస్తువులను దొంగిలించిన థార్ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
న్యూస్ లైన్ డెస్క్ : వరుస చోరీలకు పాల్పడుతున్న థార్ దొంగల ఆట కట్టించారు సంగారెడ్డి పోలీసులు. ఆగి ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులలో నగలు, విలువైన వస్తువులను దొంగిలించిన థార్ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత జూలై 25న చిరాగ్ పల్లి కోహినూర్ దాబా వద్ద ఆగి ఉన్న ఆరెంజ్ ట్రావెల్ బస్సులో 3 కిలోల బంగారు నగలను థార్ దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దొంగల ముఠా కోసం.. గాలిస్తున్న పోలీసులు జాతీయ రహదారి 65 బూర్దిపాడ్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగలను గుర్తించారు. బ్రిజా కారులో పారిపోయేందుకు ప్రయత్నించిన థార్ గ్యాంగ్ సభ్యులను వెంబడించి నలుగురిలో ఒకరిని పట్టుకున్నారు. ముగ్గురు పరారయ్యారు. నిందితుల కారు నుంచి ట్రావెల్ బస్సులో చోరీకి గురైన రూ3 కోట్ల విలువ చేసే 3 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.