నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ అను అరెస్టు చేసి విచారణ కూడా జరిపారు. కాని ఈ విచారణలో సంజయ్ రాయ్ ట్విస్ట్ ఇచ్చాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కోల్ కత్తా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తుంది. ఇప్పటికే హత్యాచార కేసుపై సీబీఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ అను అరెస్టు చేసి విచారణ కూడా జరిపారు. కాని ఈ విచారణలో సంజయ్ రాయ్ ట్విస్ట్ ఇచ్చాడు.
సంజయ్ రాయ్ ను స్థానిక సీబీఐ కోర్టు హాజరుపరిచారు. పాలీ గ్రాఫ్ టెస్టుకు ఎందుకు సమ్మతించావాని మెజిస్ట్రేట్..నిందితుడిని న్యాయమూర్తి ప్రశ్నించారు. అతను చాలా ఎమోషనల్ అయ్యారట. అంతేకాదు ..“నేను అమాయకుడిని, ఏ తప్పూ చేయలేదు. నన్ను ఇరికించారు. అసలు విషయం బయటపడితే ప్రమాదమంటు జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడట. అందుకే తాను పాలీ గ్రాఫ్ పరీక్షకు ఒప్పుకున్నానని న్యాయముర్తితో నిందితుడు చాలా ఎమోషనల్ అయ్యాడట.
నిందితుడికి సీబీఐ అధికారులు సైకోనాలసిస్ టెస్టు చేయించిన సంగతి తెలిసిందే. ఆ టెస్ట్ లో భాగంగా అతనిలో కనీసం భయం, బాధ అనేవి కనిపించలేదని సీబీఐ అధికారులు గుర్తించారు. మానవ మృగంలా అతడి ప్రవర్తన తీరు ఉందని తెలిసింది. ఇప్పుడు సీబీఐ కోర్టు లో ఏడ్వడం, ఎమోషనల్ అవ్వడం నాటకంలా అనిపిస్తుందంటున్నారు పోలీసులు. ఈ కేసులో రోజు కో ట్విస్ట్ బయటపడుతుంది.