Saripoda Sanivaaram Review:సంచలనం సృష్టిస్తున్న

తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా నాని ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈయన ఎలాంటి సినిమాల్లో చేసిన  కథ కంటెంట్ బాగుంటేనే ఓకే చెప్తారట. దసరా సినిమాతో అద్భుతమైన హిట్ కొట్టిన నాని  సరిపోదా శనివారంతో


Published Aug 29, 2024 01:52:44 PM
postImages/2024-08-29//1724919764_saripodasanivaaramnani.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా నాని ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈయన ఎలాంటి సినిమాల్లో చేసిన  కథ కంటెంట్ బాగుంటేనే ఓకే చెప్తారట. దసరా సినిమాతో అద్భుతమైన హిట్ కొట్టిన నాని  సరిపోదా శనివారంతో మరో హిట్ కొట్టబోతున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో డివివి ఎంటైన్మెంట్ బ్యానర్ పై వచ్చిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ కథానాయకగా చేసింది. అంతే కాకుండా ఎస్ జె సూర్య నెగిటివ్ రోల్ చేశారు. ట్రైలర్ తో ఎన్నో అంచనాలు పెంచిన ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా ఎలా ఉంది ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 స్టోరీ:
 ఇందులో నాని పాత్ర పేరు ( సూర్య) ఈయనకు తల్లిగా( అభిరామి )చేస్తుంది. ఆమె నాని చిన్నతనంలోనే చనిపోయే ముందు నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకొని బ్రతకాలి కావాలంటే కోపాన్ని వారంలో ఏదో ఒక రోజు చూపించమని చెప్పి మరణిస్తుంది.  దీంతో తల్లి మాట మీద, సూర్య తనకు వచ్చిన కోపం మొత్తం వారం రోజులు ఆపుకొని ఒక శనివారం రోజు చూపిస్తూ ఉంటాడు. సూర్యకు తన మరదలు కళ్యాణి అంటే చాలా ఇష్టం. కొన్ని కారణాల వల్ల మరదలు కుటుంబం సూర్యాకు దూరమవుతుంది. సూర్య పెద్దయ్యాక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తూ ఉన్న సమయంలో  అక్క పెళ్లి అవుతుంది.

పెళ్లిలోనే అక్కకు కాబోయే మామయ్యని తన శనివారం కోపం వల్ల కొట్టి గొడవ పడతాడు సూర్య. దీంతో అక్క సూర్యకు దూరమవుతుంది. ఇందులో పోలీసు పాత్రలో దయానంద్  ( ఎస్ జె సూర్య ) చేస్తాడు. దయానందుకు అన్నగా కుర్మానంద్ ( మురళి వర్మ ) తనకు రావలసినటువంటి ఆస్తిని ఇవ్వట్లేదని అతని మీద ఉన్న కోపాన్ని పెంచుకొని, ఏమి చేయలేక తన కోపాన్ని ఆ గ్రామంలోని అమాయక ప్రజల మీద చూపిస్తూ ఉంటాడు.  దయానంద్ పనిచేసే స్టేషన్ లో చారులత( ప్రియాంక మోహన్) కొత్తగా కానిస్టేబుల్ గా వస్తుంది. అయితే సూర్యతో దయానందుకు పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం వల్ల చారులతపై  ప్రేమ పుడుతుంది. అలా సూర్య శనివారం మాత్రమే కోపం చూపిస్తూ అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఆ కోపం వల్ల వచ్చిన సమస్యలేంటి. చారులత సూర్య ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా.?  సూర్య అక్క  దగ్గరవుతాడా.? అంతేకాకుండా సూర్య చిన్నప్పటి మరదల్ని కలుస్తాడా.? అలాగే కుర్మా నందు తన తమ్ముడికి ఆస్తి ఇస్తాడా.?  దయానంద్ గొడవల్లోకి సూర్య ఎందుకు ఎంటర్ అయ్యాడు అనేది తెలుసుకోవాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే. 

 విశ్లేషణ:
 నాని రెగ్యులర్ కథలు ఎంచుకున్నా కానీ అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. సరిపోదా  శనివారం చిత్రంలో కూడా ఆ విధంగానే చూపించారు. ఒక హీరో, హీరోయిన్ వల్ల ఒక ఏరియా లోని ప్రజల కోసం నిలబడడం, అమ్మ ఎమోషన్, శనివారం మాత్రమే కోపం చూపించడం వంటివి చూపించారు. సినిమా మొదటి భాగంలో సూర్య చిన్నతనం చూపించారు. అలాగే సూర్య పెద్దయ్యక ఎలా ఉన్నాడు చారులత ప్రేమ వ్యవహారం. దయానంద్ గొడవల్లోకి ఎందుకు ఎంటర్ అయ్యాడు. ఇక సెకండ్ హాఫ్ లో దయానంద్ సూర్యా ఎలా ఎదురుపడ్డారు. సొకులపాలెం ప్రజల సంగతి ఏంటి? సూర్య తన అక్క ఫ్యామిలీతో ఎలా కనెక్ట్,  అవుతారనేది పాయింట్ అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రంలో కొత్తదనం ఏమీ లేకపోయినా కానీ  విలన్ ఎలివేషన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. కానీ సినిమా బోర్ కొట్టకుండా  నాని ఫ్యాన్స్ కు నచ్చేలా అద్భుతంగా తెరకెక్కించారు అని చెప్పవచ్చు. 

 నటీనటుల పనితీరు:
 నాచురల్ స్టార్ నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ పాత్రలో అయినా అద్భుతంగా నటిస్తారు. ఇక సూర్య నానికి విలన్ గా అద్భుతంగా నటించాడు.  కానిస్టేబుల్ పాత్రలో ప్రియాంక మోహన్ తన అందాలతో మెప్పిస్తుంది. ఇక నాన్న పాత్రలో సాయికుమార్ అద్భుతంగా నటించారు.  మిగతావారు ఎవరి పాత్రలో వారు హైలైట్ గా చేశారని చెప్పవచ్చు. 

 సాంకేతిక అంశాలు:
చిత్రాన్ని టెక్నికల్ గా చాలా అద్భుతంగా తెరకెక్కించారు.సినిమాటోగ్రఫీ లైటింగ్ సెటప్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,  మహా అద్భుతమని చెప్పవచ్చు. కథ చూస్తే పాతదే అనిపిస్తుంది కానీ స్క్రీన్ ప్లే లో చాలా కొత్తగా చూపించారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. 

 ఫైనల్ గా సరిపోదా శనివారం సినిమాని తప్పకుండా కుటుంబంతో కలిసి చూడవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోందని చెప్పవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nani sj-surya saripoda-shanivaram vivek-atreya priyanka-mohan

Related Articles