అరకొర బస్సులతో విద్యార్థులకు అవస్థలు పడుతున్నారు. తాండూరు నియోజకవర్గంలోని హాజీపూర్, కృష్ణాపూర్ గ్రామానికి బస్సులు నడపాలని రోడ్డుపై శుక్రవారం విద్యార్థులు ధర్నా చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: అరకొర బస్సులతో విద్యార్థులకు అవస్థలు పడుతున్నారు. తాండూరు నియోజకవర్గంలోని హాజీపూర్, కృష్ణాపూర్ గ్రామానికి బస్సులు నడపాలని రోడ్డుపై శుక్రవారం విద్యార్థులు ధర్నా చేశారు. అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు బడి వేళల్లో అందుబాటులో ఉంచుతామని అధికారులు పదేపదే చెబుతున్నా చర్యలు మాత్రం కనిపించడం లేదని విద్యార్థులు, ప్రయాణికులు గత్యంతరం లేక తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళేందుకు రోడెక్కుతున్నారు.
గ్రామాల నుం చి మండల కేంద్రాల్లో ఉన్న ఉన్నత పాఠశాలలు, పట్టణాల్లో ఉన్న జూనియర్, డిగ్రీ కళాశాలలకు చదువుకునేందుకు వెళ్తున్న విద్యార్థులు తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్లాలంటే బస్సుల కోసం నిరీక్షించాల్సిందే. సమయానికి బస్సులు రాక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే బస్సు కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల సమయాలు మారినా విద్యార్థులకు అనుకూలంగా బస్సు వేళలను మాత్రం ఆర్టీసీ అధికారులు మార్చడం లేదని వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు ఈ విషయంపై స్పందించి సరిపడ బస్సులు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.