ప్రతి మండలానికి ఐదురుగు అధికారులతో ఫ్లడ్ మేనేజ్ మెంట్ కమిటీలు వేయాలని ఆమె ఆదేశించారు. గ్రామాల్లో చెరువులు, వాగులు, కాలువల పై వెలసిన అక్రమ కట్టడాల జాబితాను సంబంధిత జిల్లా కలెక్టర్‌కు అందించాలని సూచించారు.
న్యూస్ లైన్ డెస్క్: బుధవారం సచివాలయంలో మంచి నీటి సరఫరా శాఖలపై సీతక్క సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో శాఖల వారిగా చేపట్టాల్సిన చర్యలపై ఆమె జిల్లాల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు.
ప్రతి మండలానికి ఐదురుగు అధికారులతో ఫ్లడ్ మేనేజ్‌మెంట్ కమిటీలు వేయాలని ఆమె ఆదేశించారు. గ్రామాల్లో చెరువులు, వాగులు, కాలువల పై వెలసిన అక్రమ కట్టడాల జాబితాను సంబంధిత జిల్లా కలెక్టర్‌కు అందించాలని సూచించారు. వరద ప్రభావం లేని గ్రామాల నుంచి వరద ప్రాంతాల్లోకి తరలించి పారిశుధ్య పనులు పూర్తి చేయాలని సీతక్క ఆదేశించారు.
గ్రామాల్లోని వాటర్ ట్యాంక్‌లను కూడా శుభ్రం చేయాలని సీతక్క సూచించారు. కావాల్సిన నిధులను కూడా మంజూరు చేస్తామని ఆమె అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారుల పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని సీతక్క స్పష్టం చేశారు.