ఒకప్పుడు కోటి విద్యలు కూటికోసం అన్నారు. కానీ ప్రస్తుత కాలంలో కోటి పనులు డబ్బు కోసమే చేస్తున్నట్టు కనిపిస్తోంది. డబ్బులు సంపాదించేవారు సంపాదిస్తూనే ఉన్నారు. కొంతమంది ఎంత కష్టపడినా డబ్బు
న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు కోటి విద్యలు కూటికోసం అన్నారు. కానీ ప్రస్తుత కాలంలో కోటి పనులు డబ్బు కోసమే చేస్తున్నట్టు కనిపిస్తోంది. డబ్బులు సంపాదించేవారు సంపాదిస్తూనే ఉన్నారు. కొంతమంది ఎంత కష్టపడినా డబ్బు సంపాదించడంలో విఫలమవుతున్నారు. కొంతమంది సంపాదించిన డబ్బు కాపాడుకోలేక సతమతమవుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇప్పటినుంచి ఈ రాశుల వారికి ఆర్థికపరంగా అనేక లాభాలు ఉండబోతున్నాయి. సంపాదించిన డబ్బు చాలా వరకు సేవ్ అవుతుంది. దీనికోసం వారు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
#1. మేషం :
ఈ రాశి వారికి ఈరోజు డబ్బుల విషయంలో ఇతరులతో గొడవ అవుతుంది. ఈరోజు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టవద్దు. ఏదైనా పని చేసే ముందు రెండు నుంచి మూడు సార్లు ఆలోచించి చేయండి. ఈరోజు నుంచి వీరికి కుటుంబ సభ్యుల నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుంది. వీరు ఆర్థికంగా ఎదగాలంటే మంగళవారం ఉపవాసం ఉండాలి, ఆంజనేయ స్వామికి తమలపాకులు సమర్పించి పూజ చేయాలి.
#2. వృషభం :
ఈ రాశి వారు కాస్త తెలివి ప్రదర్శిస్తే వ్యాపారాల్లో అద్భుతమైన లాభాలు పొందుతారు. చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి కానీ వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మీ దగ్గర పని చేసే సహోద్యోగులపై ఎక్కువ ఒత్తిడి పెట్టవద్దు. లాభాలు పొందాలంటే ఆంజనేయస్వామికి చోలాన్ని సమర్పించి, హనుమాన్ చాలీసా చదవాలి.
#3. మిథునం :
ఈ రాశి వారు ఈ రోజు నుంచి ఎలాంటి పనిలో అయినా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. కానీ ప్రతి పనికి డబ్బే రావాలని కోరుకుంటే మాత్రం మీ యొక్క ఆనందాన్ని కోల్పోతారు. ఇంతకుముందు కంటే ఆర్థికంగా మెరుగుపడతారు. జాబ్ చేసే వారైతే కాస్త ప్రమోషన్ పెరుగుతుంది. ఇంకా లాభాలు రావాలంటే బజరంగ్ పఠించి, ఆంజనేయ స్వామికి బూందీని సమర్పించాలి.
#4. కర్కాటక రాశి:
ఈ రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం నుంచి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఖర్చులు తక్కువైపోయి ఆదాయం పెరుగుతుంది. ఏదైనా వ్యాపారం చేయాలంటే సాయంత్రం వేళ మంచి ముహూర్తం ఉంది. వీళ్లు ఆర్థికంగా ఎదగాలి అంటే మంగళవారం ఆంజనేయస్వామికి పచ్చిమిర్చి సమర్పించి ఉపవాసం ఉండాలి.