Sharukh Khan : ఆ సమస్యతో బాధపడుతున్న షారుఖ్.. చికిత్స కోసం అమెరికాకు

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీతో బాలీవుడ్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు షారుఖ్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీనికి కారణం ఆయన ఆరోగ్యమే కారణమని తెలుస్తోంది.


Published Jul 30, 2024 05:37:41 AM
postImages/2024-07-30/1722335497_jawansharukh.jpg

న్యూస్ లైన్ డెస్క్ : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీతో బాలీవుడ్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు షారుఖ్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీనికి కారణం ఆయన ఆరోగ్యమే కారణమని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా షారుఖ్ కంటి సమస్యతో బాధపడుతున్నారట. ఈ సమస్య మరింత తీవ్రం కావడంతో శస్త్ర చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

కొన్ని రోజుల క్రితం ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో షారుఖ్ కంటి పరీక్షలు చేయించుకోగా.. శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారట. కొద్ది రోజులకు తగ్గి పోతుందిలే అని లైట్ తీసుకున్న షారుఖ్  ఈ మధ్య కాలంలో కంటి సమస్య బాగా ఇబ్బంది పెట్టడంతో ఆయన అమెరికా వెళ్లేందుకే నిర్ణయించుకున్నారట అమెరికా వెళ్లి అక్కడే చికిత్స చేయించుకొని కొన్ని రోజులు షారుఖ్ విశ్రాంతి తీసుకోన్నారు.

అయితే.. షారుఖ్ కి కంటి సమస్య రావడం ఇదే తొలిసారి కాదు. 2014లో సైతం ఒకసారి ఆయన కంటి సమస్యతో బాధపడ్డారు. అప్పుడే కంటికి శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. దాదాపు పదేండ్ల తర్వాత మళ్లీ కంటి సమస్య తీవ్రం కావడంతో అత్యవసరంగా అమెరికాకు వెళ్లారు షారుక్. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి త్వరలోనే పూర్తి సమాచారం చెప్తామని.. అభిమానులు కంగారు పడవద్దని ఆయన మేనేజర్ పూజా దద్లానీ తెలిపారు

 

newsline-whatsapp-channel
Tags : shahrukh-khan sharuk-khan movies movie-news bollywood- bolly-wood latest-news cinema-news bollywood

Related Articles