ప్రతి ఏడాది రంజాన్ కు కానుకగా మూవీ ని రిలీజ్ చెయ్యడం సల్మాన్ ఖాన్ కు అలవాటు. అందుకే ఈ ఏడాది సికిందర్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ , రష్మిక మందన్న జంటగా వస్తున్న సినిమా సికిందర్ టీజర్ రిలీజ్ అయ్యింది. ప్రముఖ డైరక్టర్ ఏ ఆర్ మురగదాస్ డైరక్షన్ లో వస్తున్న రీసెంట్ సినిమా ..సికిందర్ . చాలా ఎమోషన్స్ తో కూడిన ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మరోసారి సల్మాన్ భాయ్ తనదైన స్టైల్ లో యాక్షన్ సీన్స్ తో అదరగొట్టారు. అలాగే మురుగదాస్ కూడా మళ్లీ తనదైన టేకింగ్ తో టీజర్ ను రిచ్ గా చూపించారు. ప్రతి ఏడాది రంజాన్ కు కానుకగా మూవీ ని రిలీజ్ చెయ్యడం సల్మాన్ ఖాన్ కు అలవాటు. అందుకే ఈ ఏడాది సికిందర్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది.