సింగర్ శ్రీరామచంద్ర పెళ్లి పేరుతో ఒక అమ్మాయిని మోసం చేశాడట.మరి ఇంతకీ ఇందులో ఉన్న నిజం ఎంత..నిజంగానే ఆ అమ్మాయిని మోసం చేశాడా.. అనేది చూస్తే ఇది అంతా ఓ అమ్మాయి శ్రీరామచంద్ర అనుకొని చేసిన పనట.శ్రీరామచంద్ర పేరుతో ఓ వ్యక్తి ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తాను సింగర్ శ్రీరామచంద్ర అని చెప్పుకొని ఓ యువతితో పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించారట.దాంతో కొద్దిరోజుల తర్వాత ఆ వ్యక్తి మొహం చాటేసేసరికి ఇదంతా శ్రీరామచంద్రనే చేస్తున్నాడని ఆ అమ్మాయి నేరుగా బట్టలు సర్దుకొని శ్రీరామచంద్ర ఇంటికి వచ్చేసిందట.దాంతో షాక్ అయిపోయిన శ్రీరామచంద్ర తల్లి ఇదంతా ఏంటి అని కొడుకుకి ఫోన్ చేసి అడగగా అమ్మ నాకేం తెలియదు అని శ్రీరామచంద్ర చెప్పారట. ఇక ఆ అమ్మాయి మీ కొడుకు నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు ఇదిగో మెసేజ్ లు చూడండి అని ఫేస్బుక్ చూపించేసరికి అసలు విషయం అప్పుడు బయటపడింది. ఈ అకౌంట్ నా కొడుకుది కాదమ్మా..వేరే ఎవరో నీతో కావాలని ఇలా చాట్ చేశారు.ఇది ఫేక్ అకౌంట్ అని పంపించిందట. ఇక ఈ సంఘటన నా జీవితంలో మర్చిపోలేనిది అంటూ సింగర్ శ్రీరామచంద్ర ఓ ఇంటర్వ్యూలో చెప్పారు
న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పేరుతో మోసం చేస్తూ,ప్రేమించిన వాళ్ల కోసం హత్యలు చేయడానికి, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం వంటి వాటి గురించి ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే కన్నడ హీరో దర్శన్ ప్రేమించిన అమ్మాయి కోసం ఒక వ్యక్తిని హత్య చేసిన కేసులో ప్రస్తుతం జైల్లో కూర్చున్నాడు. అలాగే రీసెంట్గా టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై కూడా తన లవర్ లావణ్య కేసు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.
వీరి వ్యవహారం ఇప్పటికీ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక సంచలన విషయం బయటపడింది.అదేంటంటే సింగర్ శ్రీరామచంద్ర పెళ్లి పేరుతో ఒక అమ్మాయిని మోసం చేశాడట.మరి ఇంతకీ ఇందులో ఉన్న నిజం ఎంత..నిజంగానే ఆ అమ్మాయిని మోసం చేశాడా.. అనేది చూస్తే ఇది అంతా ఓ అమ్మాయి శ్రీరామచంద్ర అనుకొని చేసిన పనట.అసలు విషయం ఏమిటంటే.. శ్రీరామచంద్ర పేరుతో ఓ వ్యక్తి ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తాను సింగర్ శ్రీరామచంద్ర అని చెప్పుకొని ఓ యువతితో పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించారట.
దాంతో కొద్దిరోజుల తర్వాత ఆ వ్యక్తి మొహం చాటేసేసరికి ఇదంతా శ్రీరామచంద్రనే చేస్తున్నాడని ఆ అమ్మాయి నేరుగా బట్టలు సర్దుకొని శ్రీరామచంద్ర ఇంటికి వచ్చేసిందట.దాంతో షాక్ అయిపోయిన శ్రీరామచంద్ర తల్లి ఇదంతా ఏంటి అని కొడుకుకి ఫోన్ చేసి అడగగా అమ్మ నాకేం తెలియదు అని శ్రీరామచంద్ర చెప్పారట. ఇక ఆ అమ్మాయి మీ కొడుకు నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు ఇదిగో మెసేజ్ లు చూడండి అని ఫేస్బుక్ చూపించేసరికి అసలు విషయం అప్పుడు బయటపడింది.
ఈ అకౌంట్ నా కొడుకుది కాదమ్మా..వేరే ఎవరో నీతో కావాలని ఇలా చాట్ చేశారు.ఇది ఫేక్ అకౌంట్ నా కొడుకు అలాంటివాడు కాదు అని ఇంటికి వచ్చిన అమ్మాయికి అన్నం పెట్టి పంపించిందట. ఇక ఈ సంఘటన నా జీవితంలో మర్చిపోలేనిది అంటూ సింగర్ శ్రీరామచంద్ర ఓ ఇంటర్వ్యూలో చెప్పారు