కెమరా స్పేస్ కోసం ఏమైనా చేసే ఆర్టిస్ట్ లు అక్కడ చాలా మందే ఉన్నారు. ఇఫ్పుడు ఈ సీజన్ లో జనాలకు సోనియా అలానే అనిపిస్తుంది. తను డీసెంట్ ..మిగిలిన వాళ్లంతా చిల్లరగాళ్లు అన్నట్లే ఉంటుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గొడవలు, ఇంట్రస్టింగ్ గా చేసే కామెంట్లు, ఇక్కడ కామన్ సెన్స్ లు , సెన్సార్లు ఉండవు. కాబట్టే బిగ్ బాస్ షో అంత హిట్టయ్యింది. ఒక్కోసారి డౌట్ వస్తుంది. వీళ్లని గొడవ పెట్టుకోవడానికే తీసుకొచ్చారేమో..ఇదంతా స్క్రిప్ట్ ఏమో..ఎవరైనా అసలు ఇలా ఆలోచించకుండా ఎవరినైనా అనేస్తారా అని ..లేదు అంటారు. కెమరా స్పేస్ కోసం ఏమైనా చేసే ఆర్టిస్ట్ లు అక్కడ చాలా మందే ఉన్నారు. ఇఫ్పుడు ఈ సీజన్ లో జనాలకు సోనియా అలానే అనిపిస్తుంది. తను డీసెంట్ ..మిగిలిన వాళ్లంతా చిల్లరగాళ్లు అన్నట్లే ఉంటుంది.
జోక్ బాలేదు...నీకు నచ్చలేదు. సరే నువ్వు చెప్పేశావ్ గా నన్ను ఇలాంటి వాటిలో లాగొద్దు నాకు నచ్చదని చెప్తే సరిపోతుంది. పెద్ద సీన్ చేసింది. అది ఎంత పెద్ద టాపిక్ అయినా సరే లాగితేనే తెగేది. విష్ణు ప్రియ నిజంగానే వల్గర్ జోక్ వేస్తే ...విష్ణు నాకు ఇలాంటివి నచ్చవ్ లైట్ తీసుకో... అని సుతారంగా చెప్పేస్తే అయిపోతుందిగా..బేబక్కని అంతే నీకు బాధ్యత లేదా..ఏదో బిగ్ బాస్ లో బేబక్కని వంటకి పెట్టుకున్నట్లు పనిపనిషిలా మాట్లాడింది. ఇవన్నీ చూసి జనాలకు చిర్రెత్తుకొచ్చింది.
హౌస్ లో గొడవలు తారాస్థాయికి చేరి.. మాటల తూటాలుపేలుతున్నాయి. మరీ ముఖ్యంగా సోనియా మాటలు కాస్త హద్దులు దాటుతున్నాయి. సోనియా కు మెల్లగా నెగిటివిటీ పెరుగుతుంది. విష్ణు ప్రియ కాస్త హద్దులు దాటుతున్నా...నోరేసుకొని పడిపోతుంది సోనియా . ఒక్క విష్ణు మీదే కాదు ..మాగ్జిమమ్ జనాలతో సోనియా అలానే ఉంటుంది. పర్సనల్ అటాకింగ్ చేయడంలో సోనియా చాలా దిట్ట.
పాపం విష్ణుప్రియ ఏమీ అనలేదు కానీ సోనియానే రెచ్చిపోయింది. చూస్తున్నవాళ్లకు చిరాకుపుట్టేలా ప్రవర్తించింది. నిజానికి మనం చూసేది మాత్రమే బిగ్ బాస్ లో జరగదు. 24 గంటల్లో ఇంపార్టెంట్ గంట మాత్రమే మనకు టెలికాస్ట్ అవుతుంది. మిగిలిన డే అంతా వాళ్లు కలిసే ఉంటారు. దీని వల్లే విష్ణు ఆ చనువు తీసుకుంది అంటున్నారు. విష్ణు ప్రియను పట్టుకుని. 'నువ్వు ముందు బట్టలే సరిగ్గా వేసుకోవు.. ఇలాటి డ్రెస్సులేసుకుని పక్కన నిల్చుంటే.. నీ పక్కన ఉన్నవారు ఇబ్బందిపడుతున్నారు. నీ వల్ల వారు డిస్‌కంఫర్ట్ అవుతున్నా సరే వారి పక్కన నిల్చుంటావ్. అని ఆమెను నోటికి వచ్చినట్టు మాట్లాడింది.
గతంలో అడల్ట్ కామెడీ షోలో ఉన్నావ్ కాబట్టే బిగ్‌బాస్‌కు పిలిచారు' అంటూ నోటికి ఎంతొస్తే అంత అనేసింది. ఏంటా దురుసు మాటలు...అంటున్నారు నెటిజన్లు. నువ్వు లాయరే అయినా నోరు పారేసుకోవడం బాలేదంటున్నారు.