DOSA: బ్రోక్ లీ తో ఇలా హెల్దీ దోశలు ట్రై చెయ్యండి !

వీటిలో ఎన్నో రకాల పోషకాలు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.దీని కోసం మనకి కావాల్సినవి ఏంటో చూద్దాం.


Published Dec 13, 2024 08:21:00 PM
postImages/2024-12-13/1734101512_hq720.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పిల్లలు ఏం చేసినా తిండి విషయంలో మాత్రం  పేరెంట్స్ సర్కస్ చెయ్యాల్సిందే.  నిజానికి ఇప్పుడు ఎంత మంచి ఫుడ్ పెట్టినా...విటమిన్ల లోపాలు ...పౌష్టికాహార లోపం తప్పడం లేదు. అందుకే ఈ సారి హెల్దీ గా బ్రోక్ లీ ..విత్ పాలక్ దోశలు ట్రై చెయ్యడం. కంటిసమస్యలు రాకుండా పిల్లలకు చాలా హెల్దీ గా పనిచేస్తుంది, అంతేకాదు బరువు తగ్గాలనుకునే వారికి కూడా బ్రకోలీ చాలా బాగా సహాయం చేస్తుంది. వీటిలో ఎన్నో రకాల పోషకాలు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.దీని కోసం మనకి కావాల్సినవి ఏంటో చూద్దాం.


కావాల్సిన పదార్థాలు :


పాలకూర - 1 కట్ట


బ్రకోలీ -కప్పు


వెల్లుల్లి రెబ్బలు -4


జీలకర్ర పొడి- టీస్పూన్


గరం మసాలా - అరటీస్పూన్


నల్ల మిరియాల పొడి -అరటీస్పూన్


ఉప్పు -రుచికి సరిపడా


పచ్చి మిర్చి-2


శనగ పిండి-కప్పు


తయారీ విధానం:


* ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు కట్​ చేసుకోవాలి. చాలా సన్నగా ముక్కలు చేసుకొండి. 


*  బ్రకోలీ శుభ్రంగా కడిగి.. ముక్కలుగా కట్ చేసుకోవాలి. సరిగ్గా మీరు పెసరట్టు కి ఎలా అయితే మిక్సీ చేసుకుంటారో అలానే ఈ బ్రకోలీ పాలక్ దోశలు కూడా చేసుకోవాలి.


* ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పాలకూర తరుగు, బ్రకోలీ ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి.. దోశ బ్యాటర్ ఎలా తయారుచేస్తారో అలా ప్రిపేర్ చేసుకొండి. 


* ఈ పేస్ట్​ని ఒక మిక్సింగ్​ బౌల్లోకి తీసుకోండి. ఆపై శనగ పిండి, జీలకర్ర, గరం మసాలా, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.


ఇక్కడ నుంచి దోశలు వేసుకోవడమే..ఈ దోశలకు కాస్త నూనె ఎక్కువ వేసుకొండి. బ్రకొలీ వాసన తగ్గేలా కాస్త సిమ్ పెట్టి వేసుకొండి. దీని వల్ల పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఈ దోశలకు చక్కటి టమోటా చట్నీ సూపర్ కాంబినేషన్. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu food-habits healthy-food-habits green-tea

Related Articles