SUDAN: ఆకలి బాధలు తట్టుకోలేక "బొగ్గులు , గడ్డి" తింటున్న సుడాన్ ప్రజలు !

అక్కడ శరాణార్ధులకు సహాయం చెయ్యలేకపోతున్నారు. రోజు లక్షన్నర నుంచి రెండు లక్షల మందికి ఇప్పుడు తవిలా సిటీ సాయం చేస్తుంది.


Published Apr 26, 2025 11:21:00 PM
postImages/2025-04-26/1745689906_20SOUTHSUDANslide10Y5articleLarge.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఎల్ ఫాషర్ సిటీకి దగ్గర్లో ఆర్మీ క్యాంపులపై దాడులు జరిగాయి . దీంతో చాలా మంది ప్రజలు అక్కడి నుంచి మరో సిటీకి పారిపోతున్నారు. అయితే ఇక్కడ మండుటెండలు ..నీరు లేక రోజుకు 40 కిలో మీటర్లు నడవలేక చనిపోతున్నారు. అంతేకాదు చాలా మంది తినడానికి తిండి లేక బొగ్గులు , ఆకులు ..గడ్డి లాంటివి తిని బతుకుతున్నారు. క్యాంపు పై దాడులు తర్వాత ప్రజలు తవిలా సిటీకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాని తవిలా సిటీ చాలా చిన్నది కావడంతో అక్కడ శరాణార్ధులకు సహాయం చెయ్యలేకపోతున్నారు. రోజు లక్షన్నర నుంచి రెండు లక్షల మందికి ఇప్పుడు తవిలా సిటీ సాయం చేస్తుంది.


ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ రెండేళ్లుగా సూడాన్ సైన్యంతో పోరాడుతోంది. ఈ యుద్ధంలో లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోయారు. కోటి 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఒక వైపు కరువు మరో వైపు ఐక్యరాజ్యసమితి సూడన్ కు ఆహారపధార్ధాలు పంపడం తగ్గించింది.జమ్‌జమ్ క్యాంపు నుంచి తప్పించుకున్న ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. ప్రపంచంలో కరవు ప్రాంతంగా అధికారికంగా నిర్ధారించబడిన ఏకైక దేశం సూడాన్. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులు తిండిలేక చనిపోవడం ప్రపంచం కన్నీరుకాల్చిన సమయంగా చెబుతున్నారు అక్కడ ప్రజలు.
 

newsline-whatsapp-channel
Tags : died war sudan people grass coal

Related Articles