నిన్న గెలిచిన జట్టులో తాను కూడా ఒక సభ్యుడ్నే అన్నంత జోష్ గవాస్కర్ ప్రతి చర్యలో కనిపించింది. ఈ డాన్సింగ్ వీడియో ..ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఛాంపియన్స్ ట్రోపీ..ఇండియా ను వరించింది. ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను ఓడించి ట్రోపీని ముద్దాడింది. ఈ విజయం యావత్ భారతీయులను చాలా సంతోషంలో మునిగేలా చేసింది. సునీల్ గవాస్కర్ వంటి క్రికెట్ దిగ్గజం సైతం ఆనందంతో నృత్యం చేశారు. 75 ఏళ్ల వయసులో మైదానంలో ఆయన పట్టలేనంత ఉత్సాహంతో డ్యాన్స్ చేసి... టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. నిన్న గెలిచిన జట్టులో తాను కూడా ఒక సభ్యుడ్నే అన్నంత జోష్ గవాస్కర్ ప్రతి చర్యలో కనిపించింది. ఈ డాన్సింగ్ వీడియో ..ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది.
75 YEAR OLD SUNIL GAVASKAR DANCING ON INDIA'S VICTORY. ❤️pic.twitter.com/IS95b5Vhj8 — Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025