సూర్యాపేట్‌లో బిత్తిరి సత్తిపై మరో కేసు నమోదు అయింది.
న్యూస్ లైన్ డెస్క్: సూర్యాపేట్‌లో బిత్తిరి సత్తిపై మరో కేసు నమోదు అయింది. హిందూ ధర్మాన్ని హిందువులను, హిందూ దేవుళ్లను కించపరుస్తూ అవహేళనగా వీడియోలు చేస్తున్నాడని సూర్యాపేట్ టూ టౌన్ పూఈస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదయింది. ఇప్పటికే నగరంలో వానరసేన పిర్యాదుతో బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేశారు. బిత్తిరిసత్తి సెల్ఫీ వీడియోలో మళ్ళీ ఏ తప్పు చేయలేదు అంటూ తనను తాను సమర్దించుకుని, కావాలనే తనపై తప్పుడు వీడియోలు సర్కూలెట్ చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హిందువులపై మళ్ళీ అహంకార పూరిత అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని హిందూ సంఘాలు మండిపడుతున్నారు. బిత్తిరి సత్తికి వానరసేన నాయకులు కొన్ని డిమాండ్లు చేశారు. బహిరంగంగా మీడియా ముందు క్షమాపణ చెప్పాలని, తను చేసిన వీడియో డిలీట్ చేయాలని, లేదంటే హిందువుల ఆగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తామంటూ వానరసేన నాయకులు హెచ్చింరించారు. కాగా, బిత్తిరి సత్తి మీద ఇప్పటికీ రాష్ట్రంలో రెండు కేసులు నమోదయ్యా.