tamanaah: బాయ్ ఫ్రెండ్ కు షాక్ ఇచ్చిన తమన్నా.. బ్రేకప్ చెప్పినట్టేనా ?

 ఓ ఈవెంట్ లో పెళ్లి పై ప్రశ్నలు ఎదురవగా.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిందట.  ప్రస్తుతం తనకు మ్యారేజ్ చేసుకునే మూడ్ లేదని.. టైమ్ వచ్చినప్పుడ చూద్దాం అని అన్నారట. మూడ్ లేదా...ప్రేమించుకుంటున్నారు.


Published Sep 08, 2024 10:40:00 AM
postImages/2024-09-08/1725772318_Tamannathumb.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  తమన్నా ప్రేమలో ఉన్న సంగతి యావత్తు భారత్ కే తెలుసు. అది ఓపెన్ సీక్రెట్ . తమన్నా మనసుకు తెగ నచ్చేశాడని విజయ్ వర్మతో లైఫ్ అధ్భుతంగా ఉంటుందని అంచనాలు కూడా వేసుకుంది తమన్నా..అయితే సడన్ గా ఏమైందో ..ప్రియుడికి షాక్ ఇచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీ లో ప్రేమలు ఎలా ఉంటాయో తెలుసుగా. 6 నెలలు ప్రేమ అంటారు మరో 6 బ్రేకప్ అంటారు. ఏది సీరియస్ గా తీసుకోరు. అయితే ఇప్పుడు విజయ్ తో పెళ్లికి తమన్నా ఇంకా గ్రీన్ జెండా ఊపలేదట.


ఈ ఏడాది పెళ్ళి చేసుకుంటారని టాక్ నడుస్తున్నా.. అది రూమర్ ఇంకా చాలా టైమ్ ఉంది. కంగారుపడకండి అనేస్తున్నారు. రీసెంట్ గా  ఓ ఈవెంట్ లో పెళ్లి పై ప్రశ్నలు ఎదురవగా.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిందట.  ప్రస్తుతం తనకు మ్యారేజ్ చేసుకునే మూడ్ లేదని.. టైమ్ వచ్చినప్పుడ చూద్దాం అని అన్నారట. మూడ్ లేదా...ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి మాత్రం మూడ్ కావాలా అంటున్నారు నెటిజన్లు .


దాదాపు రెండున్నరేళ్ల నుంచి విజయ్ వర్మ తమన్నా లవ్ లో ఉన్నారు. ప్రేమలో అన్ని అర్ధంచేసుకునే ఉంటారు. కెరీర్ విషయానికి వస్తే.. కొత్త హీరోయిన్ల రాకతో టాప్ హీరోలంతా తమన్నాను పక్కన పెట్టేశారు. అయినా ఇండస్ట్రీలో ఏదోక రకంగా నడిపిస్తుంది. ఈ టైంలో పెళ్లి చేసుకుంటే చాలా హుందా గా కూడా ఉంటుంది.తెలుగులో అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం ఒదెల 2లో త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ను పోషిస్తోంది. 

newsline-whatsapp-channel
Tags : marraige love bolly-wood tamannaah vijay-varma

Related Articles