తెలంగాణ రాష్ట్రంలో రాబోవు కొన్ని రోజుల్లో విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. దసరా సందర్భంగా స్కూళ్లకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించబోతోంది. తాజాగా అందిన సమాచారం
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో రాబోవు కొన్ని రోజుల్లో విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. దసరా సందర్భంగా స్కూళ్లకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించబోతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ ఏడాది దసరా సెలవులు ఎన్ని రోజులు ఉండబోతున్నాయి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి అనే వివరాలు చూద్దాం.. అయితే ఈ ఏడాది అక్టోబర్ రెండవ తేదీ నుంచి మొదలు స్కూళ్లకు ప్రకటిస్తారట. ఆ తర్వాత బతుకమ్మ, దసరా సెలవులు కూడా వరుసగా ఉంటాయని విద్యాశాఖ అధికారులు అంటున్నారు.
ఇదే తరుణంలో కొన్ని ప్రైవేటు స్కూల్స్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ రెండు నుంచి మొదలు అక్టోబర్ 15వ తేదీ వరకు సెలవులు ఉంటాయట. మొత్తం 13 రోజులపాటు సెలవులు రావడంతో విద్యార్థులు సంబరపడిపోతున్నారు. ఎప్పుడెప్పుడు స్కూలు అయిపోతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మే 25న 2024-25 కు సంబంధించి క్యాలెండర్ కూడా విడుదల చేసింది. ఇందులో అక్టోబర్ 2 నుంచి 15వ తేదీ వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు అలాగే జనవరి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్టు తెలుస్తోంది.
అయితే ఈ ఏడాది పిల్లలకు చాలా వరకు సెలవులు వచ్చాయి. వర్షాల కారణంగా మూడు నుంచి నాలుగు రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం వినాయక చవితి సందర్భంగా నాలుగు రోజుల సెలవులు వచ్చాయి. ఈ విధంగా విద్యార్థులకు తరచూ సెలవులు వస్తుండడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఎప్పుడు సెలవులు ప్రకటిస్తే చదువు ఎలా వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.