Game Changer: 'నానా హైరానా' మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ !

అప్ డేట్స్ ఇస్తూ చిత్రంపై  హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 28న నానా హైరానా అనే మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసింది మూవీ టీం.


Published Nov 30, 2024 11:23:00 AM
postImages/2024-11-30/1732946028_l70920241128180930.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ , ప్రముఖ దర్శకుడు శంకర్ కాంభినేషన్ లో వస్తున్న భారీ చిత్రం గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 10 న ఆడియన్స్ ముందు రానుంది. దీంతో మేకర్స్ వరుసగా అప్ డేట్స్ ఇస్తూ చిత్రంపై  హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 28న నానా హైరానా అనే మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసింది మూవీ టీం.


ప్ర‌ముఖ సింగ‌ర్లు శ్రేయ ఘోష‌ల్‌, కార్తీక్ పాడిన ఈ పాట శ్రోతల‌ను ఆక‌ట్టుకోవ‌డంతో పాటు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. రీసెంట్ గా నానా హైరానా పాట లిరికల్ వీడియో ఏకంగా 35 మిలియన్ల వ్యూస్ దాటింది. ప్రస్తుతం యూట్యూబ్ లో నెం1 గా ట్రెండింగ్ లో ఉందని ఈ ఏడాదికి ఇదే బిగ్గెస్ట్ మెలోడీ సాంగ్ గా నిలిచింది.


ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ఒక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. దీంతో మెగా అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. త‌మ అభిమాన‌ హీరో సినిమా విడుద‌ల త‌ర్వాత‌ ప్రభంజ‌నం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని కామెంట్లు పెడుతున్నారు. నెటిజన్లు మాత్రం మరోలా రియాక్ట్ అవుతున్నారు. రిలీజ్ కు ముందే మ్యూజిక్ అట్టర్ ఫ్లాప్ అని అంటున్నారు. మరీ రిలీజ్ టైంకి ఏమైనా అంచనాలు తారుమారు చేస్తుందేమో చూడాలి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news game-changer

Related Articles