దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా బతుకమ్మ సంబరాలను అధికారికంగా నిర్వహిస్తారు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ విశిష్టత పెరిగింది. కేసీఆర్ పాలనలో కవిత
న్యూస్ లైన్ డెస్క్: దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా బతుకమ్మ సంబరాలను అధికారికంగా నిర్వహిస్తారు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ విశిష్టత పెరిగింది. కేసీఆర్ పాలనలో కవిత బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి బతుకమ్మ ప్రాచుర్యతను దేశవ్యాప్తంగా, ప్రపంచ దేశాలకు తెలియజేసింది. అలాంటి బతుకమ్మ సంబరాల్లో మొదటగా స్టార్ట్ అయ్యేది ఎంగిలిపూల బతుకమ్మ. ఇక్కడితో స్టార్ట్ అయి తొమ్మిది రోజులపాటు కొనసాగుతాయి బతుకమ్మ సంబరాలు. చివరికి సద్దుల బతుకమ్మతో పండగ ఎండ్ అవుతుంది. అలాంటి బతుకమ్మలో మొదటిరోజు జరుపుకునేది ఎంగిలిపూల బతుకమ్మ. మరి ఈ బతుకమ్మ విశిష్టత ఏంటి వివరాలు ఏంటో చూద్దాం.
బతుకమ్మ పేర్చడానికి తంగేడు, గునుగు, చామంతి, రకరకాల పూలను ఉపయోగించేవారు. అన్ని రంగులతో బతుకమ్మను తయారు చేసి ఆడపిల్లలు అంతా కలిసి ఒక దగ్గర పెట్టి పాటలు పాడుతూ ఎంజాయ్ చేసేవారు. అలా ఎంగిలిపుల బతుకమ్మ పేర్చడం కోసం పూలను ఒకరోజు ముందుగా సేకరించి తీసుకువచ్చేవారు. అలా ఒకరోజు ఇంట్లో పూలు నిద్రపోయిన తర్వాత ఆ పూలను, బతుకమ్మ పేర్చేటప్పుడు నోటితో పూలను గట్టిగా ఊదుతారు. అలా నోటి దగ్గర పూలను పెట్టుకోవడం వలన దీన్ని ఎంగిలిపూల బతుకమ్మని పెద్దలంటుంటారు. అయితే ఈ బతుకమ్మ పితృ అమావాస్య రోజున ఉదయం చనిపోయిన పెద్దలకు నైవేద్యాలు సమర్పించి నంతరం పేరుస్తారట. అందుకే దీన్ని ఎంగిలిపూల బతుకమ్మ అనే కథ ప్రచారంలో ఉంది.