Balakrishna:బాలకృష్ణ కొడుకు కంటే ముందే ఆ స్టార్ హీరో కొడుకు ఇండస్ట్రీ ఎంట్రీ.!

సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో నందమూరి, కొణిదెల, అక్కినేని, మంచు ఫ్యామిలీ వారే ఎక్కువగా ఉంటారు. అలాంటి ఈ తరుణంలో ఈ ఫ్యామిలీలో నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఇందులో నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతారం హీరోగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ట్ చేస్తే మోక్షజ్ఞ కంటే ముందే  పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ఇండస్ట్రీలోకి వచ్చేలా కనిపిస్తోంది. గత రెండు నెలల నుంచి  అకిరా తన తండ్రి పవన్ కళ్యాణ్ తో  ఎన్నికల ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. తన తండ్రి విజయం సాధించిన తర్వాత తన పక్కన అఖీరానే కనిపించారు. కాబట్టి కొన్ని నెలల్లోనే ఆయన ఇండస్ట్రీ ఎంట్రీ ఇప్పించాలని పవన్ కళ్యాణ్ తన వెంట తిప్పుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా మోక్షజ్ఞ కంటే ముందే ఆఖీరా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని అంటున్నారు.


Published Jun 26, 2024 07:28:50 PM
postImages/2024-06-26/1719410330_pawam.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఉన్నారు.  ఇందులో చాలామంది ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ ఉన్నవారే. కొంతమంది కొత్తవారు కూడా ఇండస్ట్రీకి వచ్చి సొంత టాలెంట్ తో ఎదిగారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి  సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో నందమూరి, కొణిదెల, అక్కినేని, మంచు ఫ్యామిలీ వారే ఎక్కువగా ఉంటారు.  అలాంటి ఈ తరుణంలో ఈ ఫ్యామిలీలో నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నారు.

ప్రస్తుతం ఇందులో నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతారం హీరోగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన 2023 లోనే వస్తారని అనేక వార్తలు వచ్చాయి కానీ ఆయన 2025 సెప్టెంబర్ లోపు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని జ్యోతిష్యులు చెప్పారట. దాని ప్రకారమే మోక్షజ్ఞను  ఇండస్ట్రీ లోకి రప్పించడం కోసం బాలకృష్ణ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం కొంతమంది డైరెక్టర్లను కూడా ఎంపిక చేస్తారట.

 కట్ చేస్తే మోక్షజ్ఞ కంటే ముందే  పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ఇండస్ట్రీలోకి వచ్చేలా కనిపిస్తోంది. గత రెండు నెలల నుంచి  అకిరా తన తండ్రి పవన్ కళ్యాణ్ తో  ఎన్నికల ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. తన తండ్రి విజయం సాధించిన తర్వాత తన పక్కన అఖీరానే కనిపించారు.  దీంతో ఆయన పేరు సోషల్ మీడియాలో మరియు మెయిన్ మీడియాలో బాగా వైరల్ అయింది. అలాగే అకిరా నందన్ కూడా చూడటానికి ప్రభాస్ అంత ఉండడం, హీరోకు ఏ మాత్రం తక్కువ లేకపోవడం కలిసొచ్చే అంశం. కాబట్టి కొన్ని నెలల్లోనే ఆయన ఇండస్ట్రీ ఎంట్రీ ఇప్పించాలని పవన్ కళ్యాణ్ తన వెంట తిప్పుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా మోక్షజ్ఞ కంటే ముందే ఆఖీరా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pawan-kalyan akira-nandan balakrishna mokshagna

Related Articles