Nirbhaya Of Kolkata: వీ వాంట్ జస్టిస్.. మూడేళ్ల చిన్నారి ఉద్యమం..!

దోషులను శిక్షించాలని వారు చేస్తున్న ఆందోళనలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే ఓ మూడేళ్ల చిన్నారి వీడియో ఒకటి నెట్టింట తగ వైరల్ అవుతోంది. డాక్టర్‌కు ఆ చిన్నారి తన మద్దతు తెలిపింది. బుడి బుడి అడుగులతో ర్యాలీ చేస్తూ ముందుకు నడిచింది.


Published Aug 16, 2024 08:22:08 AM
postImages/2024-08-16/1723811762_wewantjustice.jpg

న్యూస్ లైన్ డెస్క్: కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజ్& హాస్పిటల్‌లో Jr.డాక్టర్‌ రేప్ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. మెడికల్ కాలేజీలో పని చేసే ఓ జూనియర్ డాక్టర్ పై గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో యువతి మెడ ఎముక విరిగిపోయింది. రెండు కళ్లు దెబ్బతిన్నాయి. ప్రైవేట్ భాగం దారుణంగా దెబ్బతింది. ఆమె శరీరంలో 150 గ్రాముల సెమెన్ కూడా లభ్యమైందని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు తెలిపారు. యువతిపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా.. అతికిరాతకంగా హింసించి చంపేశారు. 

ఓవైపు ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు, యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారు బీజేపీకి చెందిన వారని, అందుకే పోలీసులు కూడా వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. 

ఆమె అత్యాచారానికి గురైన RG కర్ మెడికల్ కాలేజ్& హాస్పిటల్‌ వద్ద మొదలు పెడితే.. బెంగాల్ మొత్తం నిరసనలతో మారుమోగిపోతోంది. హాస్పిటల్‌ వద్ద తెల్లవారుజామున 4 గంటలకు కూడా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గుడారాలు కట్టి నిరసన తెలిపారు. అయితే ఆ గుడారాలను పోలీసులు ధ్వంసం చేశారు.  అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా విరిగిన గుడారాల వద్దనే కూర్చొని మెడిసిన్ విద్యార్థులు, డాక్టర్లు నిరసన తెలిపారు. 

దోషులను శిక్షించాలని వారు చేస్తున్న ఆందోళనలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే ఓ మూడేళ్ల చిన్నారి వీడియో ఒకటి నెట్టింట తగ వైరల్ అవుతోంది. డాక్టర్‌కు ఆ చిన్నారి తన మద్దతు తెలిపింది. బుడి బుడి అడుగులతో ర్యాలీ చేస్తూ ముందుకు నడిచింది. 'వీ వాంట్ జస్టిస్' అంటూ, ముద్దు ముద్దుగా నినాదాలు చేసింది. చిన్నారి బెంగాల్ రోడ్లపై ర్యాలీ చేస్తూ న్యాయం కోసం పోరాడుతున్న వీడియో చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇక ఈ వీడియో చూసినవారంతా.. ఈ చిన్నారి ఉద్యమాన్ని చూసైనా అక్కడి ప్రభుత్వం కళ్లు తెరుచుకోవాలని అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : ts-news news-line newslinetelugu telanganam justiceformoumitadebnath nirbhayaofkolkata justiceforrgkar

Related Articles